ఐసీసీ కొత్త సీఈవో మను సాహ్ని | Manu Sawhney named as ICC Chief Executive | Sakshi
Sakshi News home page

ఐసీసీ కొత్త సీఈవో మను సాహ్ని

Jan 17 2019 9:52 AM | Updated on Jan 17 2019 9:52 AM

Manu Sawhney named as ICC Chief Executive - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా ఈఎస్‌పీఎస్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను సాహ్ని నియమితులయ్యారు. ఇతను డేవిడ్‌ రిచర్డ్సన్‌ స్థానంలో సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంగ్లండ్‌లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్‌తో రిచర్డ్సన్‌ పదవీకాలం ముగియనుంది.

దీంతో ఐసీసీ అపెక్స్‌ కమిటీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్, నామినేషన్స్‌ కమిటీ కొత్త సీఈవోగా సాహ్నిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇంగ్లండ్‌లో వన్డే ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం జూలైలో ఆయన సీఈవోగా బాధ్యతలు చేపడతారు. సింగపూర్‌ స్పో ర్ట్స్‌ హబ్‌కు మను గతంలో సీఈవోగా పనిచేశాడు. ఈఎస్‌పీఎన్‌లో కూడా గతం లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement