దుబాయ్: కరోనా (కోవిడ్–19) ధాటికి ఇప్పటికే ఒలింపిక్స్, యూరో కప్‌లు వచ్చే ఏడాదికి తరలిపోగా... ఐపీఎల్ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు కరోనా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈవెంట్‌లపైనా ప్రభావం చూపడం మొదలుపెట్టింది. 2021లో జరిగే టి20 ప్రపంచ కప్, 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్ ఈవెంట్‌లకు సంబంధించి ఈ ఏడాది జూన్ 30లోపు జరగాల్సిన అన్ని అర్హత టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దాంతో పాటు శ్రీలంక వేదికగా జరగాల్సిన 2021 మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌ను అనుకున్న తేదీల్లో జరపాలా వద్దా అన్న విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని క్రిస్ అన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఏప్రిల్‌లో ఆరంభం కావాల్సిన ట్రోఫీ టూర్‌ను కూడా ఐసీసీ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment