దుబాయ్: ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. ఆదివారం వెస్టిండీస్‌తో సిరీస్‌ను 3–0తో గెలుచుకున్న అనంతరం భారత్ నంబర్‌వన్‌గా (269 రేటింగ్ పాయింట్స్) నిలిచింది. ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను రెండో స్థానానికి పడేసి రోహిత్ సేన ముందంజ వేసింది. ఇంగ్లండ్‌కు కూడా సమానంగా 269 రేటింగ్ పాయింట్లే ఉన్నా... 39 మ్యాచ్‌ల ద్వారా పాయింట్లపరంగా భారత్ (10,484), ఇంగ్లండ్‌కంటే (10,474) పది పాయింట్లు ఎక్కువగా ఉండటంతో అగ్రస్థానం దక్కింది.
ఈ జాబితాలో పాకిస్తాన్ (266) మూడో స్థానంలో నిలిచింది. గతంలో భారత్ 2016లో చివరిసారిగా నంబర్‌వన్‌గా నిలిచింది. రెండు నెలల పాటు ఆ స్థానంలో ఉన్న జట్టు ఆ తర్వాత వెనుకబడిపోయింది. ప్రస్తుత ర్యాంకింగ్స్ పీరియడ్‌లో 5–0తో న్యూజిలాండ్‌తో, 2–1తో ఆ్రస్టేలియాపై, 3–2తో ఇంగ్లండ్‌పై, 3–0తో న్యూజిలాండ్‌పై, 3–0తో వెస్టిండీస్‌పై సాధించిన విజయాల కారణంగా భారత్‌కు టాప్ ర్యాంక్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment