లండన్: భారత మహిళల జట్టుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) జరిమానా విధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో స్లో ఓవర్ కారణంగా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయానికి అనుగుణంగా బౌలింగ్ చేయడంలో విఫలమైనందున మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నాం’’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. ఆదివారం నాటి రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. దీంతో.. మూడు మ్యాచ్‌ల సిరీస్ 1–1 సమమైంది. ఇక రెండో టీ20లో కీలకమైన బీమాంట్ వికెట్‌ను తీసిన భారత వుమెన్ క్రికెటర్ దీప్తి శర్మ (1/18)ను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు వరించింది. అయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటుకు కారణమైన భారత మహిళల జట్టు జరిమానా బారిన పడింది.
Comments
Please login to add a commentAdd a comment