న్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో వరుసగా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు కోసం 2023–25 డబ్ల్యూటీసీ సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం రెండేళ్ల వ్యవధిలో భారత్ 6 టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఇందులో 3 స్వదేశంలో, 3 విదేశాల్లో ఉంటాయి.
వచ్చే నెలలో జరిగే వెస్టిండీస్ పర్యటనతో భారత్ ఈ పోరును మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఈ ఏడాది చివర్లో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. అనంతరం సొంతగడ్డపై వరుసగా 3 సిరీస్‌లు ఆడుతుంది. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో, బంగ్లాదేశ్‌తో, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్‌లో తలపడుతుంది.
చివరగా ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆ్రస్టేలియాకు వెళుతుంది. ఈ సిరీస్‌లలో ప్రదర్శన ఆధారంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధిస్తుందా లేదా అనేది ఆసక్తికరం.
రెండేళ్లు, నాలుగేళ్లు ముందుగా...
2025 జూన్‌లో భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడుతుంది. దీనికి సంబంధించిన వేదికలను ఈసీబీ అప్పుడే ప్రకటించడం విశేషం. లార్డ్స్, ఓవల్, ఎడ్జ్‌బాస్టన్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానాల్లో ఇరు జట్లు ఐదు టెస్టులు ఆడతాయి. 2029లో కూడా భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment