Team India Moved One Step Closer-ICC WTC Final After Winning 1st Test Vs AUS - Sakshi
Sakshi News home page

WTC 2021-23: ఫైనల్‌ ఆడేందుకు మరింత చేరువగా..

Published Sat, Feb 11 2023 7:50 PM | Last Updated on Sat, Feb 11 2023 8:24 PM

Team India Moved One Step Closer-ICC WTC Final Winning 1st Test Vs AUS - Sakshi

నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌​ 132 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్‌పై భారీ విజయంతో టీమిండియా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC 2021-23) ఫైనల్‌ ఆడేందుకు మరింత చేరువైంది. ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించిన భారత్‌ తన పర్సంటేజీ పాయింట్స్‌ను మరింత మెరుగుపరుచుకుంది. 

తొలి టెస్టుకు ముందు టీమిండియా ఖాతాలో 58.93 పర్సంటేజీ పాయింట్లు ఉన్నాయి. విజయం తర్వాత ఆ సంఖ్యను 61.67కు పెంచుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరింత దగ్గరైంది. అయితే ఇప్పటికే ఫైనల్‌ బెర్తు దక్కించుకున్న ఆస్ట్రేలియా మాత్రం పర్సంటేజీ పాయింట్లను కోల్పోయింది. ఆసీస్‌ పర్సంటేజ్‌.. 75.56 నుంచి 70.83 పాయింట్లకు పడిపోయింది. 

ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడాలంటే ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టుల్లో రెండు గెలిచి ఒకటి డ్రా చేసుకుంటే చాలు. అయితే శ్రీలంక(53.33 పాయింట్లు), సౌతాఫ్రికా(48.72 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నప్పటికి వారికి డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే అవకాశాలు అంతంతే. 

ప్రస్తుతం శ్రీలంక మార్చిలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడనుండగా.. అటు దక్షిణాఫ్రికా.. ఫిబ్రవరి 28 నుంచి వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడనుంది. రెండో స్థానంలో ఉన్న టీమిండియాకు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న లంక, ప్రొటిస్‌ల మధ్య పాయింట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ టీమిండియా మిగతా మూడు టెస్టుల్లో మూడు ఓడిపోతే అప్పుడు లంక, సౌతాఫ్రికాలో ఎవరో ఒకరు ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. అలా కాకుండా టీమిండియా మిగిలిన మూడు టెస్టుల్లో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు గెలిస్తే మాత్రం లంక, సౌతాఫ్రికాల ఫైనల్‌ కథ ముగిసినట్లే.  

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 132 పరుగుల ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన టెస్టులో టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లు విజృంభించడంతో ఆసీస్‌ విలవిల్లాడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన ఆసీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే కుప్పకూలింది. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌తో 400 పరుగులకు ఆలౌటైంది. రోహిత్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా, అక్షర్‌ పటేల్‌లు అర్థశతకాలతో రాణించారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది.

చదవండి: T20 World Cup: పాక్‌తో కీలకపోరు.. భారత స్టార్‌ ఓపెనర్‌ దూరం

ముందే భయపడ్డారు; పిచ్‌పై ఉన్న శ్రద్ద ఆటపై పెడితే బాగుండు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement