![Great Significant-Moment-ICC-Announces-Equal Prize-Money For-Cricketers - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/14/AUS.jpg.webp?itok=7Dvk6FGE)
డర్బన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సమానత్వానికి ‘జై’ కొట్టింది. పురుషులతో పాటు మహిళలకు ఒకే తరహా టోర్నీ ప్రైజ్‌మనీ ఇచ్చేందుకు ‘సై’ అంది. అంటే ఒకవేళ రోహిత్ శర్మ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ గెలుచుకుంటే ఎంత మొత్తం వస్తోందో... హర్మన్‌ప్రీత్ కౌర్ మెగా ఈవెంట్ గెలిచినా అంతే వస్తుంది. ఇకపై తేడాలుండవ్... పక్షపాతానికి తావే లేదు.
ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కొన్నేళ్ల కిందటి నుంచే సమానత్వాన్ని అమలు చేస్తున్నారు. కొన్నిరోజులుగా ఐసీసీలోనూ దీనిపై చర్చ జరుగుతుండగా, గురువారం అధికారిక ప్రకటన విడుదలైంది. ‘ఐసీసీ ప్రపంచకప్‌లలో టోర్నీ ప్రైజ్‌మనీ ఇకపై సమం కాబోతోంది. పురుషుల క్రికెటర్లకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘సిరీస్’, జట్లకు పార్టిసిపేషన్ ఫీజులు ఎంతయితే ఇస్తారో... మహిళా క్రికెటర్లకు, జట్లకు అంతే సమంగా చెల్లిస్తారు’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: #YashasviJaiswal: అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్
శతకాలతో చెలరేగిన రోహిత్, జైశ్వాల్.. పట్టు బిగిస్తోన్న టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment