న్యూయార్క్: అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రస్తుత టి20 ప్రపంచకప్ విజేతకు ఈసారి గతం కంటే రెట్టింపు ప్రైజ్‌మనీ లభించనుంది. కప్ గెలిచిన జట్టుకు రూ. 20.35 కోట్లు (2.45 మిలియన్ అమెరికా డాలర్లు), రన్నరప్ జట్టుకు రూ. 10.63 కోట్లు (1.28 మిలియన్ డాలర్లు) అందజేస్తారు.
సెమీఫైనల్స్‌తోనే ఆగిపోయిన ఇరుజట్లకు రూ. 6.54 కోట్లు (7,87,500 మిలియన్ డాలర్లు) చొప్పున ఇస్తారు. ఈనెల 29వ తేదీన ముగిసే ఈ టోర్నీలో తొలిసారి 20 జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 93.48 కోట్లు (11.25 మిలియన్ డాలర్లు)గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఇది గత 2022 ప్రపంచకప్ టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 46.53 కోట్ల (5.6 మిలియన్ డాలర్లు)కి రెట్టింపు మొత్తం. ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్‌కు రూ. 13.29 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment