ప్రైజ్‌మనీ విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం | BCCI Increases Prize Money For Domestic Tournaments - Sakshi
Sakshi News home page

BCCI: ప్రైజ్‌మనీ విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం

Published Sun, Apr 16 2023 9:10 PM | Last Updated on Mon, Apr 17 2023 11:07 AM

BCCI Increases Prize Money For Domestic Tournaments - Sakshi

దేశవాలీ టోర్నీల విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీ విషయంలో బీసీసీఐ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశీయ టోర్నీల్లో విజేతలతో పాటు అన్ని జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్‌లో అధికారికంగా ప్రకటించారు. దేశవాలీ టోర్నీల ప్రైజ్‌మనీ పెంచుతున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని జై షా తెలిపారు. రంజీ ట్రోఫీ సహా మహిళల దేశవాలీ వన్డే, టి20 టోర్నీల్లో​ ఇచ్చే ప్రైజ్‌మనీలో భారీ పెంపుదల తెచ్చింది. 

రంజీ ట్రోఫీ విజేత జట్టకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీని రూ. 5కోట్లకు పెంచింది. అలాగే రన్నరప్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. రంజీ ట్రోఫీలో సెమీఫైనల్లో ఓడిపోయిన జట్టుకు రూ. కోటి అందించనున్నారు. ఇక దులీప్‌ ట్రోఫీ విజేతకు రూ. కోటి, రన్నరప్‌కు రూ 50 లక్షలు, విజయ్‌ హజారే ట్రోఫీ విజేతకు రూ. కోటి.. రన్నరప్‌కు రూ.50 లక్షలు, దేవదర్‌ ట్రోఫీ విజేతకు రూ. 40 లక్షలు.. రన్నరప్‌కు రూ. 20 లక్షలు, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేతకు రూ. 80 లక్షలు.. రన్నరప్‌కు రూ.40 లక్షలు అందించనున్నారు.

ఇక దేశవాలీ మహిళల వన్డే ట్రోఫీ(సీనియర్‌) విజేతకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 లక్షల ప్రైజ్‌మనీని రూ.50 లక్షలకు పెంచింది. అలాగే రన్నరప్‌కు రూ. 25 లక్షలు ఇవ్వనుంది. ఇక మహిళల టి20 ట్రోఫీ విజేతకు రూ. 40 లక్షలు.. రన్నరప్‌కు రూ. 20 లక్షలు ఇవ్వనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement