equal payment
-
క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం
డర్బన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సమానత్వానికి ‘జై’ కొట్టింది. పురుషులతో పాటు మహిళలకు ఒకే తరహా టోర్నీ ప్రైజ్‌మనీ ఇచ్చేందుకు ‘సై’ అంది. అంటే ఒకవేళ రోహిత్ శర్మ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ గెలుచుకుంటే ఎంత మొత్తం వస్తోందో... హర్మన్‌ప్రీత్ కౌర్ మెగా ఈవెంట్ గెలిచినా అంతే వస్తుంది. ఇకపై తేడాలుండవ్... పక్షపాతానికి తావే లేదు. ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కొన్నేళ్ల కిందటి నుంచే సమానత్వాన్ని అమలు చేస్తున్నారు. కొన్నిరోజులుగా ఐసీసీలోనూ దీనిపై చర్చ జరుగుతుండగా, గురువారం అధికారిక ప్రకటన విడుదలైంది. ‘ఐసీసీ ప్రపంచకప్‌లలో టోర్నీ ప్రైజ్‌మనీ ఇకపై సమం కాబోతోంది. పురుషుల క్రికెటర్లకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘సిరీస్’, జట్లకు పార్టిసిపేషన్ ఫీజులు ఎంతయితే ఇస్తారో... మహిళా క్రికెటర్లకు, జట్లకు అంతే సమంగా చెల్లిస్తారు’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: #YashasviJaiswal: అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్ శతకాలతో చెలరేగిన రోహిత్, జైశ్వాల్.. పట్టు బిగిస్తోన్న టీమిండియా -
మహిళలకు సమాన వేతనం ఇవ్వాలి
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు విజయవాడ (గాంధీనగర్) : మహిళలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తగిన ప్రాధాన్యన్యం, సమాన పనికి సమాన వేతనం లేకపోవడం దురదృష్టకరమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అన్నారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 12వ తేదీన రాష్ట్ర నిర్మాణ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవానీ మాట్లాడుతూ ఆర్టికల్–14 ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఉండాలన్న నిబంధనను ప్రభుత్వాలు ఉల్లఘింస్తున్నాయన్నారు. అనంతరం వివిధ రంగాల నుంచి వచ్చిన మహిళలు తమ సమస్యలను వివరించారు. శ్రామిక మహిళా ఫోరం నాయకురాలు పి.సూర్యావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శారద, సరస్వతి, అంగన్వాడీ వర్కర్ యూనియన్ నేతలు జె.లలిత, భాగ్యలక్ష్మి, గంగావతి, గీతాభారతి తదితరులు పాల్గొన్నారు.