భారత్, పాక్ మ్యాచ్‌లో ఫ్రీ హిట్‌కు బౌల్డయి మూడు పరుగులు తీసిన కోహ్లి
ICC Announces New Rules- దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తరుచూ వివాదాస్పదమవుతున్న నిర్ణయాలను సవరించింది. సాఫ్ట్ సిగ్నల్, ఫ్రీ హిట్‌కు బౌల్డయితే పరుగులపై స్పష్టతనిచ్చింది. పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనే బ్యాటర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే! ఇకపై తన ఇష్టానికి వదిలేయరు. ఇది ఐసీసీ కొత్త రూల్!
సాఫ్ట్ సిగ్నల్: సాధారణంగా క్యాచ్‌లు పట్టినపుడు తీసుకునే నిర్ణయాలు. బౌండరీకి దగ్గరో, లేదంటే బంతి నేలను తాకినట్లు పట్టిన క్యాచ్‌లు వివాదాస్పదమవుతాయి. ఫీల్డ్ అంపైర్ తొలుత అవుటిచ్చినా... దాన్ని మళ్లీ టీవీ (థర్డ్) అంపైర్‌కు నివేదిస్తారు.
కానీ మళ్లీ సాఫ్ట్ సిగ్నల్’ ప్రకారం అవుటనే ప్రకటిస్తారు. ఇప్పుడు ‘సాఫ్ట్’కు కాలం చెల్లింది. టీవీ అంపైర్‌దే తుది నిర్ణయమవుతుంది. దీంతో ఫీల్డ్ అంపైర్‌కు ఇది మరో కోతలాంటిది!
ఫ్రీ హిట్‌కు బౌల్డయితే:
ఫ్రీ హిట్‌కు బౌల్డయితే బ్యాటర్ తీసిన పరుగులు చట్టబద్ధమే! ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదని ఐసీసీ కమిటీ ప్రకటించింది. అయితే ఇలా తీసిన పరుగులు ఎక్స్‌ట్రాల కోటలో జమకావు. బ్యాటర్స్ ఖాతాలోకి వెళ్తాయి.
గత టి20 ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఫ్రీ హిట్‌కు బౌల్డయి మూడు పరుగులు రాబట్టాడు. పాక్ క్రికెటర్లు గగ్గోలు పెడితే అంపైర్లు నియమావళిని వివరించినా... చాన్నాళ్లు దీనిపై చర్చ నడిచింది!
హెల్మెట్ ఐచ్చికం కాదు... కచ్చితం:
పేసర్లు బౌలింగ్‌కు దిగితే బ్యాటర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. అలాగే బ్యాటర్లకు చేరువగా మోహరించిన ఫీల్డర్లు సైతం హెల్మెట్ పెట్టుకోవాలి.
చదవండి: వారెవ్వా భువీ.. 2 పరుగులు, 4 వికెట్లు! వీడియో వైరల్
టైటాన్స్ క్వాలిఫై... సన్‌రైజర్స్ అవుట్
Comments
Please login to add a commentAdd a comment