ICC T20 World Cup 2021: India to face Pakistan Match On October 24 - Sakshi
Sakshi News home page

టి20 ప్రపంచకప్‌లో అక్టోబర్‌ 24న భారత్, పాక్‌ మ్యాచ్‌!

Published Thu, Aug 5 2021 6:22 AM | Last Updated on Thu, Aug 5 2021 10:01 AM

India To Face Pakistan On October 24th In Dubai - Sakshi

న్యూఢిల్లీ: క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 24న (ఆదివారం) జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో యూఏఈ, ఒమన్‌ వేదికగా జరిగే టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) షెడ్యూల్‌ను రూపొందించింది. దాయాది సమరాన్ని ఆదివారం జరిపితే వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు సమాచారం. టి20 షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. గ్రూప్‌–2లో భారత్, పాకిస్తాన్‌లతో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌ జట్లు ఉన్నాయి. మరో రెండు జట్లు క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా గ్రూప్‌లో చేరుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement