ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అతడే(PC: ICC)
ICC Men's Player of the Month: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను అంతర్జాతీయ క్రికెట్ మండలి అవార్డు వరించింది. వన్డేల్లో నెంబర్.1 గా ఉన్న ఈ రికార్డుల వీరుడు ఆగష్టు నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. తనతో పోటీ పడిన సహచర ఆటగాడు షాదాబ్ ఖాన్, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు.
గత నెలలో నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో రెండు అర్ధ శతకాలతో పాటు ఓ సెంచరీ నమోదు చేసిన బాబర్ ఆజంకు క్రికెట్ అభిమానులు పెద్దపీట వేశారు. కాగా శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విఫలమైన బాబర్.. తర్వాతి రెండు వన్డేల్లో వరుసగా ఫిఫ్టీలు సాధించాడు.
నేపాల్‌పై శతక్కొట్టిన బాబర్
తద్వారా.. పాకిస్తాన్ అఫ్గన్ జట్టును 3-0తో వైట్‌వాష్ చేయడంలో బాబర్ ఆజం కీలక పాత్ర పోషించాడు. ఇక ఆసియా కప్-2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో 131 బంతుల్లో ఏకంగా 151 పరుగులు సాధించాడు.
అరుదైన రికార్డు
తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీల మార్కు అందుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆగష్టు నెలలో నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 264 పరుగులు రాబట్టిన బాబర్ ఈ మేరకు అవార్డు గెలుచుకున్నాడు. కాగా తన కెరీర్‌లో బాబర్ ఈ అవార్డు అందుకోవడం ఇది మూడోసారి.
వరల్డ్‌కప్‌లోనూ సత్తా చాటి
ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన బాబర్ ఆజం.. ఆసియా కప్- వన్డే వరల్డ్‌కప్-2023లో గెలుపొంది పాకిస్తాన్ అభిమానులకు మరింత వినోదం పంచుతామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో బాబర్ ఆజం విఫలమైన విషయం తెలిసిందే. రిజర్వ్ డే అయిన సోమవారం నాటి కొలంబొ మ్యాచ్‌లో అతడు 10 పరుగులకే నిష్క్రమించాడు.
చదవండి: Asia Cup: షాహిద్ ఆఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment