పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నూతన సారధిని ఎంపిక చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో త్వరలో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఈ నియామకం చేపట్టినట్లు పీసీబీ వెల్లడించింది. వర్క్ లోడ్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చి కొత్త కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు పీసీబీ సోమవారం (మార్చి 13) ప్రకటించింది.
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల బృందంలో సైమ్ అయూబ్, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) స్టార్లకు తొలిసారి అవకాశం కల్పించిన పీసీబీ.. సీనియర్ ఇమాద్ వసీంను చాలాకాలం తర్వాత తిరిగి జట్టులోకి తీసుకుంది. పీసీబీ సెలెక్షన్ కమిటీ నూతన చీఫ్ హరూన్ రషీద్ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్ లోడ్ పాలసీ ఆధారంగా సెలెక్షన్ ప్రక్రియ సాగినట్లు పీసీబీ పేర్కొంది.
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..
షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment