ICC Announces Venues For Upcoming Events From 2024 To 2031.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 2024 నుంచి 2031 మధ్య జరగనున్న ఐసీసీ మేజర్ ఈవెంట్లకు ఆతిథ్యమివ్వనున్న దేశాల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇక 2024-2031 మధ్య కాలంలో నాలుగు టి20 వరల్డ్‌కప్‌లు.. రెండు చాంపియన్స్ ట్రోపీలు, రెండు వన్డే వరల్డ్‌కప్‌లు జరగనున్నాయి. ఈ ఐసీసీ మేజర్ టోర్నీలకు ఎనిమిది దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో ఒక టోర్నీకి అమెరికా- వెస్టిండీస్, మరొక టోర్నీకి పాకిస్తాన్, మూడు మేజర్ టోర్నీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.
►జూన్ 2024లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమివ్వనున్నాయి.
►2025 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది
►2026 ఫిబ్రవరిలో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు భారత్,శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి
►2027 అక్టోబర్- నవంబర్ నెలలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలు ఆతిథ్యమివ్వనున్నాయి.
►2028 అక్టోబర్ నెలలో జరగనున్న టి20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
►2029 అక్టోబర్ నెలలో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది.
►2030 జూన్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.
►2031 అక్టోబర్- నవంబర్ నెలలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ఇండియా, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment