
తొలి డబ్ల్యూటీసీ ట్రోఫీతో కివీస్ ఆటగాళ్లు(కర్టెసీ: ఐసీసీ)
దుబాయ్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ షెడ్యూల్, ఇందుకు సంబంధించిన నూతన పాయింట్ల విధానాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. సిరీస్ లెంత్‌తో సంబంధం లేకుండా గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు 12 పాయింట్లు, టై అయితే 6, డ్రా అయితే 4 పాయింట్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది. అదే విధంగా పాయింట్ల శాతం ఆధారంగా ఆయా జట్లకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు ఐసీసీ పేర్కొంది. కాగా మొట్టమొదటి డబ్ల్యూటీసీ ట్రోఫీని కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.
సిరీస్‌లోని మ్యాచ్‌ల ఆధారంగా కేటాయించే పాయింట్లు
2 మ్యాచ్‌ల సిరీస్- 24 పాయింట్లు
3 మ్యాచ్‌ల సిరీస్- 36 పాయింట్లు
4 మ్యాచ్‌ల సిరీస్- 48 పాయింట్లు
5 మ్యాచ్‌ల సిరీస్- 60 పాయింట్లు
Comments
Please login to add a commentAdd a comment