
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన పురుషుల వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ర్యాంకుల్లో ఎటువంటి మార్పు జరగలేదు. 848 రేటింగ్స్‌తో కోహ్లి రెండో స్థానంలో ఉండగా... 817 రేటింగ్స్‌తో రోహిత్ మూడో ర్యాంకులో ఉన్నాడు. ఈ విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తొలి స్థానంలో ఉన్నాడు. లంకతో జరిగిన తొలి వన్డేలో అర్ధ శతకంతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన శిఖర్ ధావన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు పైకి ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల విభాగంలో భారత్ నుంచి బుమ్రా (6వ ర్యాంక్) మాత్రమే టాప్–10లో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 9వ ర్యాంకులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment