దుబాయ్: శ్రీలంక మాజీ క్రికెటర్ అవిష్క గుణవర్ధనేపై వచ్చిన అవినీతి ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొట్టివేసింది. ఐసీసీ ఆధ్వర్యంలోని అవినీతి వ్యతిరేక ట్రిబ్యునల్ గుణవర్ధనే ఎలాంటి తప్పూ చేయలేదని నిర్ధారించింది. ఇకపై గుణవర్ధనే క్రికెట్‌కు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. లంక తరఫున అతను 6 టెస్టులు, 61 వన్డేలు ఆడాడు. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 2017లో జరిగిన టీ10 టోర్నమెంట్‌లో శ్రీలంక బౌలర్ నువాన్ జోయిసాతో కలిసి, అవిష్క మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఐసీసీ ట్రిబ్యునల్ అతడిని నిర్దోషిగా తేల్చింది. ఇక లంక తరఫున 30 టెస్టులు, 95 వన్డేలు ఆడి బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్న 42 ఏళ్ల నువాన్‌పై నమోదైన నాలుగు అభియోగాలలో మూడింటిని కొట్టివేసిన ఐసీసీ.. విచారణకు సహకరించని కారణంగా అతడిపై ఆరేళ్ల నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగేపై కూడా ఐసీసీ ఇటీవల ఎనిమిదేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అతనిపై అవినీతి ఆరోపణలు, ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో దిల్హారాపై సుదీర్ఘ నిషేధం విధిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
చదవండి: Virat Kohli: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న కోహ్లి
SRH: కోవిడ్‌పై పోరు: సన్‌రైజర్స్ భారీ విరాళం
Comments
Please login to add a commentAdd a comment