
నేను ఎదుర్కొన్న కఠినమైన, ఉత్తమమైన బౌలర్ అతడే: జయవర్ధనే
కెరీర్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత ఉత్తమమైన, కఠినమైన ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ అని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే అన్నాడు. అతడితో మ్యాచ్ అంటేనే పీడకలలా ఉండేదని గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో జయవర్దనే క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే అద్భుతమైన బౌలర్‌గా నిరూపించుకున్నాడు.
ఈ నేపథ్యంలో శ్రీలంక- పాకిస్తాన్ తలపడిన ప్రతిసారి వసీం బౌలింగ్ అంటే తాను భయపడేవాడినంటూ జయవర్ధనే తాజాగా వ్యాఖ్యానించాడు. ఐసీసీ డిజిటల్ షోలో అతడు మాట్లాడుతూ తన అనుభవం గురించి పంచుకున్నాడు. మీరు ఎదుర్కొన్న బెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘వసీం అక్రమ్. అతడు తన కెరీర్ పీక్‌లో ఉన్నపుడు నేను అరంగేట్రం చేశాను.
తన చేతిలో కొత్త బంతి ఉందంటే అంతే ఇక! అతడిని ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని! నిజంగా పీడకలలా అనిపించేది. వసీం బౌలింగ్ యాక్షన్ బాగుంటుంది. బ్యాటర్‌న ఇబ్బంది పెట్టడం తనకు వెన్నతో పెట్టిన విద్య’’ అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. నిలకడగా బౌలింగ్ చేయడంలో వసీం అక్రమ్ దిట అని ప్రశంసించాడు. కాగా పాక్ మాజీ సారథి వసీం అక్రమ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 916 వికెట్లు పడగొట్టాడు. ఇందులో టెస్టు వికెట్లు 414. వన్డే వికెట్లు 502.
చదవండి 👇
IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు!
Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్‌కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే..