జో రూట్‌కు వెండి బ్యాట్ (PC: ICC)
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్సీ భారం తొలగిన తర్వాత మరింత స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన సిరీస్‌లో రూట్ తొలి టెస్టు సందర్భంగా 26వ టెస్టు సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్‌కు ముందు రూట్‌కు అరుదైన బహుమతి లభించింది. ఈ టెస్టు నంబర్ వన్ బ్యాటర్ వెండి బ్యాట్ కానుకగా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా కివీస్‌తో జరిగిన మొదటి టెస్టులో అతడు తొలి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రూట్ పది వేల మార్కు అందుకున్న సంగతి తెలిసిందే. అదే కివీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ వైట్‌వాష్ చేయడంలో కీలకంగా వ్యవహరించి న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌తో సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు.
చదవండి: Ind Vs Eng 5th Test: నాకు దక్కిన గొప్ప గౌరవం.. బుమ్రా భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment