ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టమీ బేమౌంట్‌కు సమున్నత గౌరవం దక్కింది. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆమెను ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు వరించింది. కాగా ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ టీ20లలో గతేడాదికి గానూ అత్యధిక పరుగులు సాధించిన నంబర్ వన్ బ్యాటర్‌గా టమీ బేమౌంట్ ఘనత సాధించింది.
అదే విధంగా.. ఓవరాల్‌గా ప్రపంచంలోని మూడో బ్యాటర్‌గా రికార్డులో తన పేరు లిఖించుకుంది. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడిన టమీ... 102 పరుగులతో రాణించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి సత్తా చాటింది. ముఖ్యంగా చేజారుతుందనుకున్న రెండో మ్యాచ్‌లో 53 బంతుల్లో 63 పరుగులు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చింది.
అంతేగాక భారత మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మరోసారి టమీ అదరగొట్టింది. 113 పరుగులతో రాణించింది. అత్యధిక స్కోరు 97. ఈ నేపథ్యంలో ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టమీ నిలిచింది. ఆమె ఆట తీరును కొనియాడుతూ ఐసీసీ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించింది. టేక్ ఏ బౌ అంటూ ప్రశంసించింది.
Match-winning knocks, brisk starts and some memorable moments ✨
— ICC (@ICC) January 23, 2022
Take a bow, Tammy Beaumont 🙇
More 👉 https://t.co/Q32mIXUBoQ pic.twitter.com/uB6dRWKMeU
Comments
Please login to add a commentAdd a comment