బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మెన్ పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో జై షా పోటీచేయనున్నట్లు సమాచారం. ఐసీసీ నిర్వహణలో ఆయన సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది.
ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్‌లే గత నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అతడు మరో మారు ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉంది. కానీ చైర్మెన్ పదవిపై జై షా పదవిపై ఆసక్తిగా ఉండటంతో గ్రెగ్ బార్క్‌లే పోటీ నుంచి తప్పుకోనున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది.
కాగా గ్రెగ్ బార్క్‌లే జై షా మద్దతుతోనే ఐసీసీ ఛైర్మన్ కావడం గమనార్హం. అయితే టీ20 వరల్డ్‌కప్-2024 ముందు వరకు జై షా బీసీసీఐ సెక్రటరీ, ఐసీసీ చైర్మెన్‌గానే కొనసాగించాలని భావించండట. కానీ ఇటీవల అమెరికా, వెస్టిండీస్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచ కప్‌ఆతిథ్యం, నిర్వహణపై విమర్శలు రావడంతో జై షా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఐసీసీ బాస్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నట్లు వినికిడి. ఇక వేళ జై షా ఐసీసీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపడితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది.
కాగా 2019లో బీసీసీఐ కార్యదర్శిగా జైషా పగ్గాలు చేపట్టాడు. అంతకంటే ముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా జైషా పనిచేశాడు. అదే విధంగా 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment