BCCI secretary
-
బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియామకం
బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియమించబడ్డాడు. అధ్యక్షుడు రోజర్ బిన్నీ తన ప్రత్యేక అధికారాలు వినియోగించి సైకియాను కార్యదర్శిగా ఎంపిక చేశాడు. సైకియా ప్రస్తుతం బీసీసీఐ జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. అసోంకు చెందిన సైకియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. మాజీ కార్యదర్శి జై షా ఐసీసీ పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో సైకియా నియామకం అనివార్యమైంది. ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షా జోడు పదవుల్లో కొనసాగలేడు. అందుకే అతను బీసీసీఐ కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. శాశ్వత కార్యదర్శిని ఎప్పుడు నియమిస్తారో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో బీసీసీఐ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పుడే శాశ్వత కార్యదర్శి పదవిని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. -
ఐసీసీ చైర్మన్‌గా రెండు విడతల్లో కొనసాగనున్న జై షా..!
డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జై షా రెండు విడతల్లో (చెరి మూడేళ్లు) ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నాడని తెలుస్తుంది. దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ విషయాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవి మూడు విడతల్లో ఆరేళ్ల పాటు ఉంది. ఈ మోడల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తుంది.కాగా, జై షా ఇటీవలే ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. గ్రెగ్ బార్క్లే స్థానంలో జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. బార్క్లే 2020 నుంచి రెండు విడతల్లో ఐసీసీ చైర్మన్‌గా పని చేశాడు. వాస్తవానికి బార్క్లే పదవీకాలం మరో రెండేళ్ల పాటు ఉండింది. అయితే బార్క్లే వ్యక్తిగత కారణాల చేత చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నూతన చైర్మన్‌గా షా ఎంపికయ్యాడు.మరోవైపు ఐసీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ పదవిలో పెప్సీకో చైర్ పర్సన్ ఇంద్రా నూయి మూడు విడతల్లో కొనసాగింది. ఇంద్ర నూయి ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.జై షా తర్వాత ఎవరు..?ఐసీసీ చైర్మన్‌గా జై షా నియామకం ఖరారైపోయిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఎవరు చేపడతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త కార్యదర్శి రేసులో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ముందున్నట్లు తెలుస్తుంది. రోహన్‌తో పాటు బీసీసీఐ ట్రెజరర్ ఆశిష్ షెలార్, జాయింట్ సెక్రెటరీ దేవజిత్ సైకియా, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ అనిల్ పటేల్ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. -
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌తో మొదలై ఐసీసీ పీఠం దాకా..!
35 ఏళ్ల జై షా ఐసీసీ పీఠం అధిరోహించనున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. షా ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం నిన్ననే అధికారికంగా వెలువడింది. షా ఐసీసీ బాస్‌గా ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపడతాడు. షా ఐసీసీలో అత్యున్నత స్థానానికి చేరడానికి ఒక్కో మెట్టు ఎక్కాడు. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ మొదలైన షా ప్రస్తానం.. తాజాగా ఐసీసీ అగ్రపీఠం వరకు చేరింది. షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. షా ఐసీసీ చైర్మన్ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతాడు. షా ఐసీసీ పీఠం దక్కించుకున్న ఐదో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.జై షా ప్రస్తానం..2009-2013 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్2013-2015 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ2015-2019 వరకు బీసీసీఐ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ2019-2024 వరకు బీసీసీఐ సెక్రెటరీ2024- ఐసీసీ చైర్మన్ -
ఐసీసీ చైర్మన్ రేసులో జై షా
దుబాయ్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే రెండో దఫా పదవీ కాలం ఈ నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఐసీసీ నియమావళి ప్రకారం ఒక వ్యక్తి చైర్మన్ పదవిలో గరిష్టంగా మూడుసార్లు (రెండేళ్ల చొప్పున ఆరేళ్ల పాటు) కొనసాగే అవకాశముంది. అయితే న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్ అటార్నీ అయిన బార్క్లే వరుసగా మూడోసారి కొనసాగేందుకు విముఖత చూపారు. దీంతో కొత్త చైర్మన్ ఎన్నిక అనివార్యం కావడంతో ఈ నెల 27వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
Jay Shah: ఐసీసీ తదుపరి చైర్మన్‌గా జైషా?
బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మెన్ పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో జై షా పోటీచేయనున్నట్లు సమాచారం. ఐసీసీ నిర్వహణలో ఆయన సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్లే గత నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అతడు మరో మారు ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉంది. కానీ చైర్మెన్ పదవిపై జై షా పదవిపై ఆసక్తిగా ఉండటంతో గ్రెగ్ బార్క్లే పోటీ నుంచి తప్పుకోనున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. కాగా గ్రెగ్ బార్క్లే జై షా మద్దతుతోనే ఐసీసీ ఛైర్మన్ కావడం గమనార్హం. అయితే టీ20 వరల్డ్‌కప్-2024 ముందు వరకు జై షా బీసీసీఐ సెక్రటరీ, ఐసీసీ చైర్మెన్‌గానే కొనసాగించాలని భావించండట. కానీ ఇటీవల అమెరికా, వెస్టిండీస్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచ కప్ఆతిథ్యం, నిర్వహణపై విమర్శలు రావడంతో జై షా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐసీసీ బాస్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నట్లు వినికిడి. ఇక వేళ జై షా ఐసీసీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపడితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది.కాగా 2019లో బీసీసీఐ కార్యదర్శిగా జైషా పగ్గాలు చేపట్టాడు. అంతకంటే ముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా జైషా పనిచేశాడు. అదే విధంగా 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. -
అప్పటివరకు భారత కెప్టెన్ అతడే.. బీసీసీఐ సెక్రటరీ కీలక ప్రకటన
టీ20 వరల్డ్‌కప్ విజయనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచే తన చివరిదని రోహిత్ సృష్టం చేశాడు. అయితే టీ20ల్లో రోహిత్ వారసుడు ఎవరన్నది బీసీసీఐ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.టీ20ల్లో భారత కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే రోహిత్ టీ20ల నుంచి తప్పుకోవడంతో మిగితా ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా అన్న సందిగ్ధం అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత జట్టుకు రోహిత్ శర్మనే సారథ్యం వహిస్తాడని జై షా సృష్టం చేశాడు."గతేడాది నవంబర్ 23న వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి పాలైనప్పటకి.. అభిమానుల మనసును మాత్రం గెలుచుకున్నాము. కానీ ఈ సారి జూన్ 29 న అభిమానుల హృదయాలతో పాటు కప్‌ను కూడా గెలుచుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఛాంపియన్స్‌గా నిలిచి బార్బడోస్‌లో భారత జెండాను ఎగురవేశాము. ఈ విజయం తర్వాత మాకు త్వరలోనే కొన్ని ఐసీసీ కీలక ఈవెంట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మేము డబ్ల్యూటీసీ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తామన్న నమ్మకంగా మాకు ఉందని బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో జైషా పేర్కొన్నాడు.కాగా.. పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాదిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే.. భారత జట్టుని పాక్‌ను పంపిస్తారా? భారత జట్టు మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తారా? అన్నది ఇంకా నిర్ణయించలేదు. -
ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా జై షా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) లో ఎంతో ప్రాధాన్యత ఉన్న, బలమైన ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతానికి జై షా ఎఫ్ అండ్ సీఏలో సభ్యుడిగా మాత్రమే ఉంటారు. మార్చి 2023 నుంచి రాస్ మెకల్లమ్ స్థానంలో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే మరో రెండేళ్లపాటు చైర్మన్‌గా కొనసాగుతారు. -
గంగూలీ, జై షా కాదు.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అతడేనా..?
బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ఈ నెల 18న ముగియనున్న నేపథ్యంలో కొత్తగా ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే అంశంపై చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం విధితమే. చాలామంది ప్రస్తుత కార్యదర్శి జై షా బీసీసీఐ కొత్త బాస్ అవుతాడని.. బీసీసీఐ సారధి సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో నిలుస్తాడని భావించగా.. తాజాగా అధ్యక్ష పదవి రేసులో కొత్త పేరు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్ 1983 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు, మాజీ ఆల్‌రౌండర్, భారత మాజీ సెలక్టర్ రోజర్ బిన్నీ పేరు గురువారం బీసీసీఐ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ లో కనిపించింది. బీసీసీఐ నిర్వహించబోయే వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) కోసం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తరఫున రోజర్ బిన్నీ పేరు ఉంది. గతంలో కేఎస్పీఏ తరఫున సంతోష్ మీనన్ సమావేశాలకు హాజరయ్యేవాడు. తాజాగా మీనన్ స్థానంలో బిన్నీ సమావేశాలకు హాజరుకానుండటంతో బీసీసీఐ అధ్యక్ష ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బిన్నీకి కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముందు నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగిన జై షాకు అతని తండ్రి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశిస్సులు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఈ ప్రచారాల సంగతి అటుంచితే.. బీసీసీఐ కొత్త బాస్ ఎవరనేది తెలియాలంటే అక్టోబర్ 18 వరకు ఎదురు చూడాల్సిందే. బీసీసీఐ అధ్యక్ష పదవి సహా పలు కీలక పోస్టులకు అక్టోబర్ 11, 12 తేదీల్లో నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 14న పోటీలో ఉన్న సభ్యుల వివరాలు వెల్లడిస్తారు. అనంతరం అక్టోబర్ 18న ఎన్నికల నిర్వహణ.. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడవుతాయి. -
IPL 2021: అదిరిపోయే రికార్డు.. లీగ్ చరిత్రలో అత్యధికం
IPL 2021 Created Wonderful Record In TV Viewership: క్రికెట్ అతి పెద్ద పండుగ అయిన ఐపీఎల్లో వీక్షకుల సంఖ్య సీజన్ సీజన్‌కు మిలియన్ల సంఖ్యలో పెరుగుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వస్తుంది. తాజా సీజన్లో ఈ సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోయి 380 మిలియన్లు దాటింది. ఇది 35వ మ్యాచ్ ముగిసే సమయానికి గతేడాదితో పోలిస్తే.. ఏకంగా 12 మిలియన్లు అధికం. ప్రస్తుత సీజన్లో ప్లే ఆఫ్ బెర్తులు ఇంకా ఖరారు కాక ముందే ఈ స్థాయిలో వీక్షకుల సంఖ్య నమోదు కావడం ఇదే ప్రధమమని, లీగ్ ముగిసే సమయానికి ఇది 500 మిలియన్ల మార్కును దాటుతుందని లీగ్ బ్రాడ్‌కాస్టర్ ప్టార్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది. I am delighted to share that #IPL2021 continues to register significant growth in viewership📈380 million TV viewers (till match 35)12 million more than 2020 at the same stage🙌🏾Thank you, everyone. It will only get more exciting from here on @IPL @StarSportsIndia @BCCI— Jay Shah (@JayShah) September 30, 2021 వీక్షకుల పరంగా అదిరిపోయే రికార్డు సాధించడం పట్ల బీసీసీఐ కార్యదర్శి జై షా సైతం ట్విటర్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్ టీవీ వీక్షకుల సంఖ్య గత నాలుగు సీజన్లుగా 400 మిలియన్ల మార్కును దాటుతుంది. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ ఏడాది తొలి ఐపీఎల్ మ్యాచ్ టీవీ వీక్షకుల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌ను 323 మిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. చదవండి: కోహ్లిపై ఫిర్యాదు.. విరుచుకుపడిన టీమిండియా ఆటగాడు -
ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఎప్పుడైనా మేం సిద్ధమే: బీసీసీఐ
న్యూఢిల్లీ: జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌ను విశ్వక్రీడల్లో భాగం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం చాలా రోజులుగా వ్యక్తమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఆ ముచ్చట కూడా తీరనుంది. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎప్పుడు చేర్చినా తాము సిద్ధమేనంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీతో కలిసి బీసీసీఐ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని పేర్కొన్నారు. కాగా, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని గతంలోనే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ)తో ఐసీసీ చర్చలు జరిపింది. అయితే, అప్పుడు బీసీసీఐ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆ ప్రయత్నాలు అర్ధంతరంగా ముగిశాయి. కానీ, ప్రస్తుతం బీసీసీఐ సానుకూలంగా స్పందించడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అన్నీ సజావుగా సాగితే.. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఐసీసీ ఎనిమిది జట్లను బరిలో దించే అవకాశముంది. బీసీసీఐ.. భారత పురుష, మహిళల జట్లను బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫార్మాట్ విషయానికొస్తే.. టీ20 లేదా టీ10 తరహాలో అతి చిన్న ఫార్మాట్వైపు మొగ్గు చూపే ఆస్కారం ఉంది. కాగా, 1900 పారిస్ ఒలింపిక్స్‌లోనే క్రికెట్ భాగంగా ఉండింది. ఆప్పుడు జరిగిన ఏకైక మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో గ్రేట్ బ్రిటన్ స్వర్ణం నెగ్గగా, ఫ్రాన్స్‌కు రజతం దక్కింది. అయితే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం కల్పించడం అదే చివరిసారి. విశ్వక్రీడల్లో ఆధిపత్యం చెలాయించే అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో జెంటిల్మెన్ గేమ్‌ను విశ్వక్రీడల నుంచి తొలగించారు. -
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జై షా
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షాను అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించిన మరో పదవి వరించింది. ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగా జై షా ఎంపికయ్యారు. నజ్ముల్ హసన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడైన 32 ఏళ్ల జై షా ఏసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన అతి పిన్న వయస్కుడు కావడం విశేషం. తాజా బాధ్యతల పట్ల సంతోషం వ్యక్తం చేసిన జై షా... ఆసియాలో మహిళల క్రికెట్, జూనియర్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా జై షాకు బోర్డు సహచరులు అభినందనలు తెలియజేశారు. -
ఐపీఎల్–2021 భారత్‌లోనే నిర్వహిస్తాం!
ముంబై: ఐపీఎల్–2021ను నిర్వహించే విషయంలో ప్రత్యామ్నాయ వేదిక గురించి అసలు తాము ఏమాత్రం ఆలోచించడం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఈ సారి కచ్చితంగా భారత్‌లోనే నిర్వహించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అవసరమైతే ఆటగాళ్లందరికీ వ్యాక్సిన్ ఇప్పించే ఆలోచన కూడా ఉందని ధుమాల్ వెల్లడించారు. ‘ఐపీఎల్ ఎక్కడ జరపాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. భారత్‌లో నిర్వహించగల వనరులు మాకు ఉన్నాయని నమ్ముతున్నాం. కాబట్టి ప్రత్యామ్నాయ వేదిక అనే మాటే ఉదయించదు. ప్రస్తుత పరిస్థితుల్లో యూఏఈకంటే భారత్‌లోనే పరిస్థితులు బాగున్నాయి. ఇదే కొనసాగి ఇక్కడే ఐపీఎల్ జరగాలని కోరుకుందాం’ అని ధుమాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్–ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరిగే తొలి రెండు టెస్టులను ప్రేక్షకుల్లేకుండానే నిర్వహించనున్న బీసీసీఐ... అహ్మదాబాద్‌లో జరిగే తర్వాతి రెండు టెస్టుల విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. స్టేడియం మొత్తం సామర్థ్యం వరకు కాకుండా కనీసం 25–50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా ధుమాల్ చెప్పారు. -
‘షిర్కేకు ఆ అర్హత లేదు’
ముంబై: బీసీసీఐ కార్యదర్శి స్థానం నుంచి సుప్రీంకోర్టు ఉద్వాసనకుగురైన అజయ్షిర్కేకు బోర్డులో పూర్తిగా దారులు మూసుకుపోయినట్టేనని లోధా ప్యానెల్ స్పష్టం చేసింది. మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) ప్రతినిధిగా కూడా ఆయనకు బీసీసీఐ సమావేశాల్లో పాల్గొనేందుకు అర్హత లేదని తేల్చింది. తరచుగా అడిగే ప్రశ్నలకు ప్యానెల్ తగిన సమాధానాలు తెలిపి సందేహాలను నివృత్తి చేసింది. ఏడు ప్రశ్నలతో కూడిన ఈ జాబితాలో షిర్కే అంశం రెండో ప్రాధాన్యంలో పేర్కొంది. అలాగే బోర్డు అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నట్టు పేర్కొంటున్న బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) చీఫ్ సౌరవ్ గంగూలీ మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ పరిధిలోకి వస్తాడని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో గంగూలీ క్యాబ్ పదవీకాలం ముగుస్తుంది. -
'ప్రపంచంలో అతడే బెస్ట్ బ్యాట్స్ మన్'
ముంబై: భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి అంటే తనకెంతో ఇష్టమని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ తెలిపారు. కోహ్లికి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. ప్రపంచంలో అతడే బెస్ట్ బ్యాట్స్ మన్ అని కితాబిచ్చారు. ఫేస్ బుక్ ద్వారా థాకూర్ అభిమానులతో ముచ్చటించారు. టీ20 వరల్డ్ కప్ లో ఫ్యాన్స్ అందించిన మద్దతు మరవలేనిదని అన్నారు. టీమిండియా ఫైనల్ కు చేరకపోయినా తుదిపోరులో తలపడిన జట్లకు అభిమానులు అండగా నిలవడం అద్భుతమని పేర్కొన్నారు. ఇండియా ఏ, అండర్-19 క్రికెట్ టీమ్స్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ గొప్పగా పనిచేస్తుడని ప్రశంసించారు. 1983లో చాంఫియన్లను సముచితంగా సత్కరించేందుకు బీసీసీఐ వద్ద డబ్బు లేదని, కానీ ప్రస్తుతం పరిస్థితి మారిందన్నారు. ప్రపంచ క్రికెట్ ను ఇప్పుడు మనం శాసిస్తున్నామని థాకూర్ చెప్పారు. -
బీసీసీఐ కార్యదర్శితో పీసీబీ చీఫ్ భేటి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ షహర్యార్ ఖాన్... ఆదివారం బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌ను కలుసుకున్నారు. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందని ఠాకూర్ తెలిపారు. ‘రెండు బోర్డుల మధ్య స్నేహసంబంధాలు ఉండాలని మేం కోరుకున్నాం’ అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. -
సంజయ్ పటేల్‌కు షాక్
బరోడా: బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్‌కు తమ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) మేనేజింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న పటేల్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆదివారం జరిగిన బీసీఏ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పటేల్‌తో పాటు మరో ముగ్గురిపై కూడా వేటు పడింది. ఇటీవల జరిగిన బీసీఏ ఎన్నికల్లో చిరాయు అమిన్ గ్రూపు మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. అయితే సంజయ్ పటేల్ సంయుక్త కార్యదర్శిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు. కానీ ఎన్నికల అనంతరం పటేల్‌తో పాటు మరో నలుగురు కమిటీ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఉద్వాసన పలకాలని డిమాండ్లు వినిపించాయి. ఓ సమావేశంలో కమిటీ సభ్యులు ఇదే అంశాన్ని లేవనెత్తగా బీసీఏ అధ్యక్షుడు సమర్జిత్ గైక్వాడ్ తన వీటో పవర్‌ను ఉపయోగించి అడ్డుకున్నారు. అయితే ఈ విషయంలో అధ్యక్షుడికి ఎక్కువ అధికారాలున్నాయా.. కమిటీకా.. తేలేందుకు లీగల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. మేనేజింగ్ కమిటీకి అనుకూలంగా లీగల్ అభిప్రాయం రావడంతో సంజయ్ పటేల్‌ని తొలగించారు.