టీ20 వరల్డ్‌కప్ విజయనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచే తన చివరిదని రోహిత్ సృష్టం చేశాడు. అయితే టీ20ల్లో రోహిత్ వారసుడు ఎవరన్నది బీసీసీఐ ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
టీ20ల్లో భారత కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే రోహిత్ టీ20ల నుంచి తప్పుకోవడంతో మిగితా ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా అన్న సందిగ్ధం అభిమానుల్లో నెలకొంది.
తాజాగా ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత జట్టుకు రోహిత్ శర్మనే సారథ్యం వహిస్తాడని జై షా సృష్టం చేశాడు.
"గతేడాది నవంబర్ 23న వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి పాలైనప్పటకి.. అభిమానుల మనసును మాత్రం గెలుచుకున్నాము. కానీ ఈ సారి జూన్ 29 న అభిమానుల హృదయాలతో పాటు కప్‌ను కూడా గెలుచుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఛాంపియన్స్‌గా నిలిచి బార్బడోస్‌లో భారత జెండాను ఎగురవేశాము.
ఈ విజయం తర్వాత మాకు త్వరలోనే కొన్ని ఐసీసీ కీలక ఈవెంట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మేము డబ్ల్యూటీసీ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తామన్న నమ్మకంగా మాకు ఉందని బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో జైషా పేర్కొన్నాడు.
కాగా.. పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాదిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే.. భారత జట్టుని పాక్‌ను పంపిస్తారా? భారత జట్టు మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తారా? అన్నది ఇంకా నిర్ణయించలేదు.
Comments
Please login to add a commentAdd a comment