అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ అనూహ్యరీతిలో తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. భారత క్రికెట్ సంఘం (బీసీసీఐ) గతకొంతకాలంగా శశాంక్ తీరుపై గుర్రుగా ఉందని సమాచారం.