
బీసీసీఐ అధ్యక్ష పీఠంపై దాల్మియా
బీసీసీఐ అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా ఏకగ్రీవ ఎన్నికయ్యారు.
చెన్నె: పవర్ గేమ్ లో జగ్మోహన్ దాల్మియా పైచేయి సాధించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు. మరో 3 నెలల్లో 75వ ఏట అడుగుపెడుతున్న ఆయన బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని మరోమారు కైవశం చేసుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయి బీసీసీఐలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు.
దాల్మియా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. సోమవారం చెన్నైలో జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ మేరకు ప్రకటించారు.