Sourav Ganguly To Play In Legends League Cricket - Sakshi
Sakshi News home page

Legends League Cricket 2022: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌.. మళ్లీ ఫీల్డ్‌లోకి దిగనున్న సౌరవ్‌ గంగూలీ..!

Published Sun, Jul 31 2022 6:28 PM | Last Updated on Sun, Jul 31 2022 7:20 PM

Sourav Ganguly To Play In Legends League Cricket - Sakshi

Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ బాస్‌ సౌరవ్ గంగూలీ చాలాకాలం తర్వాత మళ్లీ బ్యాట్‌ పట్టనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఒకటి, రెండు ఛారిటీ మ్యాచ్‌ల్లో కనిపించిన దాదా.. త్వరలో ప్రారంభం కాబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో (ఎల్ఎల్‌సీ) తిరిగి తన బ్యాట్‌కు పని చెప్పనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఎల్‌ఎల్‌సీ రెండో సీజన్‌లో ఓ స్పెషల్ మ్యాచ్‌లో గంగూ భాయ్‌ ఆడబోతున్నాడు.

అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ (భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమం) సందర్భంగా మహిళా సంక్షేమం కోసం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ద్వారా నిధులు వసూలు చేయబోతున్నామని దాదా స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు. త్వరలో లెజెండ్స్‌తో తాను క్రికెట్‌ ఆడబోతున్నానని, ఇందు కోసం జిమ్‌లో వర్కవుట్లు చేస్తునాన్నని అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు. టీమిండియా తరఫున 113 టెస్ట్‌ మ్యాచ్‌లు, 311 వన్డేలు ఆడిన గంగూలీ, రెండో ఫార్మాట్లలో కలిపి దాదాపు 20 వేల పరుగులు చేశాడు. 
చదవండి: కోహ్లిని ఆసియాకప్‌కు ఎంపిక చేయకపోవచ్చు: పాక్‌ మాజీ ఆటగాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement