Sourav Ganguly Explain Reasons Behind Why Virat Kohli Removed From ODI Captaincy - Sakshi
Sakshi News home page

Virat Kohli: కోహ్లి నా మాట వినలేదు: గంగూలీ

Published Fri, Dec 10 2021 5:20 AM | Last Updated on Fri, Dec 10 2021 11:46 AM

BCCI President Sourav Ganguly Explains Virat Kohli Was Removed From ODI Captaincy - Sakshi

Sourav Ganguly Explain Reasons Behind Why Virat Kohli Removed From Odi Captaincy: విరాట్‌ కోహ్లిని వన్డే కెప్టెన్సీనుంచి తప్పిస్తూ రోహిత్‌ శర్మను ఆ స్థానంలో నియమిస్తున్నట్లు బుధవారం ఏకవాక్య ప్రకటన చేసిన బీసీసీఐ ఇప్పుడు సదరు అంశంపై స్పందించింది. స్వయంగా బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ దీనిపై స్పష్టతనిచ్చాడు. కోహ్లి టి20 నాయకత్వ బాధ్యతలనుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే వన్డే కెప్టెన్‌గా కూడా అతడిని తొలగించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారని గంగూలీ వెల్లడించాడు. రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు ఉండటం భారత్‌లాంటి జట్టుకు సరైంది కాదని అతను అభిప్రాయ పడ్డాడు.

‘టి20 కెప్టెన్సీని రాజీనామా చేయవద్దని కోహ్లిని మేం అభ్యర్థించాం. అయితే అతను మా మాటను పట్టించుకోకుండా తప్పుకోవాలనే నిర్ణయించుకున్నాడు. దాంతో సెలక్టర్లు కూడా వన్డేలు, టి20లకు వేర్వేరు కెప్టెన్లు నాయకత్వ సమస్యలు వస్తాయని భావించారు. ఇతర వివరాలు చెప్పలేను గానీ అన్నింటికంటే ప్రధాన కారణం మాత్రం ఇదే. వన్డేల్లో కోహ్లి కెప్టెన్సీ రికార్డు బాగుందనేది వాస్తవం. ఆ అంశాన్ని కూడా పరిశీలించాం.

అయితే తాను బాధ్యత తీసుకున్న కొన్ని మ్యాచ్‌లలోనే రోహిత్‌ కూడా తానేంటో నిరూపించుకున్నాడు. అతడు ఇకపై కూడా కెప్టెన్‌గా రాణిస్తాడనే ఆశిస్తున్నాం. ఈ విషయాన్ని కోహ్లికు నేను, చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ కూడా స్వయంగా చెప్పాం. మా నిర్ణయాన్ని అతనూ అంగీకరించాడు’ అని గంగూలీ వివరించాడు. 

చదవండి: Rohit Sharma: ఒకప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్‌.. త్వరలోనే టెస్టులకు కూడా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement