అమ్మాయిలు క్రికెట్‌ ఆడాల్సిన అవసరం లేదు.. వైరలవుతోన్న గంగూలీ కామెంట్లు  | Girls Dont Need To Play Cricket, Gangulys Old Video Questioning Womens Cricket Resurfaces | Sakshi
Sakshi News home page

Sourav Ganguly: అమ్మాయిలు క్రికెట్‌ ఆడాల్సిన అవసరం లేదు.. వైరలవుతోన్న గంగూలీ పాత కామెంట్లు 

Published Sat, Dec 18 2021 4:30 PM | Last Updated on Sat, Dec 18 2021 4:30 PM

Girls Dont Need To Play Cricket, Gangulys Old Video Questioning Womens Cricket Resurfaces - Sakshi

Ganguly Questioning Women Cricket Resurfaces: తమ ఆరాధ్య క్రికెటర్‌ వన్డే కెప్టెన్సీ ఊడటానికి బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీనే ప్రధాన కారణమని భావిస్తున్న విరాట్‌ కోహ్లి అభిమానులు.. దాదా గతంలో చేసిన చిన్నచిన్న పొరపాట్లను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఈ క్రమంలో గంగూలీ గతంలో అమ్మాయిలను ఉద్దేశిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి కోహ్లి అభిమానుల కంటపడింది. గంగూలీని టార్గెట్‌ చేసేందుకు ఈ వీడియోను ప్రధాన ఆస్త్రంలా మార్చుకున్న కోహ్లి ఫ్యాన్స్‌, గంగూలీపై భారీ ఎత్తున నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. 

వివరాల్లోకి వెళితే.. దాదాపు మూడేళ్ల కిందట ఓ బెంగాళీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. అమ్మాయిలు క్రికెట్‌ ఆడాల్సిన అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన కూతురు సనా గంగూలీ ప్రస్తావన సందర్భంగా గంగూలీ ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. సనాని.. తానెప్పుడు క్రికెట్‌ ఆడమని అడగలేదని, అసలు అడగనని, ఎందుకంటే అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని, అమ్మాయిలు క్రికెట్‌ ఆడటానికే పనికిరారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

అప్పట్లో పెద్ద దుమారం రేపిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. నెటిజన్లు గంగూలీని ఏకిపారేస్తున్నారు. బీసీసీఐ బాస్‌కి మహిళలంటే గౌరవం లేదని, అందుకే అలాంటి చీప్‌ వ్యాఖ్యలు చేశాడని మండిపడుతున్నారు. కాగా, భారత మహిళల జట్టు, పురుషుల జట్టుతో సమానంగా రాణిస్తూ ప్రపంచక్రికెట్‌లో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విధితమే. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జులన్ గోస్వామి, షెఫాలీ వర్మ లాంటి క్రికెటర్లు పురుష క్రికెట్లతో సమానంగా రాణిస్తూ, ఇంచుమించు వారంతటి క్రేజ్‌ని సంపాదించారు.
చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో గంభీర్‌ ‘రీ ఎంట్రీ’.. ఈసారి కొత్త అవతారంలో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement