బీసీసీఐ కొత్త బాస్ శశాంక్ మనోహర్ | Manohar all set to be elected unopposed as BCCI president | Sakshi
Sakshi News home page

బీసీసీఐ కొత్త బాస్ శశాంక్ మనోహర్

Published Sat, Oct 3 2015 8:26 PM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

బీసీసీఐ కొత్త బాస్ శశాంక్ మనోహర్

బీసీసీఐ కొత్త బాస్ శశాంక్ మనోహర్

ముంబై: బీసీసీఐ మాజీ చీఫ్ శశాంక్ మనోహర్ మరోసారి అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టనున్నారు. బోర్డు అధ్యక్షుడిగా మనోహర్ ఎన్నిక లాంఛనమే. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి రోజైన శనివారం నాటికి మనోహర్ ఒక్కరే రేసులో మిగిలారు. దీంతో ఆదివారం జరిగే బోర్డు ప్రత్యేక సాధారణ సమావేశంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నిక అనివార్యమైంది. దాల్మియా ఈస్ట్ జోన్కు చెందినవారు. బోర్డు నిబంధనల ప్రకారం దాల్మియా స్థానంలో ఈస్ట్ జోన్ క్రికెట్ సంఘాల ప్రతినిధి లేదా ఆ సంఘాలు బలపరిచిన వ్యక్తికి బోర్డు పగ్గాలు చేపట్టాలి. ఈస్ట్ జోన్లోని ఆరు క్రికెట్ సంఘాలూ మనోహర్కు మద్దతు తెలపడంతో బీసీసీఐ చీఫ్గా ఆయన ఎన్నికకు మార్గం సుగమమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement