టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరికి షాకిచ్చిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్ టెస్ట్ ముగిసిన వెంటనే తన 14 ఏళ్ల కెరీర్‌కు అశ్విన్ ముగింపు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో అశూ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
అతడి నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులే కాకుండా సహచరలు సైతం అశ్చర్యపోయారు. ఈ నిర్ణయాన్ని ఎంత సడన్‌గా అశ్విన్ ఎందుకు తీసుకున్నాడో ఆర్ధం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికి 14 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు తన సేవలను అందించినందుకు గాను అశ్విన్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.
అతడికి ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అశ్విన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశించారు. అతడొక లెజెండ్ అని మోదీ కొనియాడారు.
"అంతర్జాతీయ క్రికెట్ నుంచి మీ ఆకస్మిక రిటైర్మెంట్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను అందరిని ఆశ్చర్యపరిచింది. మీ నుంచి మరెన్నో ఆఫ్-బ్రేక్‌ల కోసం అందరూ ఎదురు చూస్తున్న సమయంలో మీరు క్యారమ్ బాల్‌ని విసిరి అందరినీ బౌల్డ్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని మీరు ఎంతగానో ఆలోచించి తీసుకున్నారని మాకు ఆర్ధమవుతోంది. భారత క్రికెట్ తరపున సుదీర్ఘ కాలం పాటు ఆడిన తర్వాత ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు.
భారత క్రికెట్ కోసం 14 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి అద్భుతమైన ప్రదర్శన చేశారు. అందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇకపై జెర్సీ నంబర్ 99ను మేము మిస్ అవ్వనున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా నిలిచారు. మీ స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధులను హడలెత్తించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మీరు పడగొట్టిన ఒక్కో ఒక్క వికెట్ వెనక మీ కష్టం దాగి ఉంది. టెస్టు క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల రికార్డు మీ పేరిట ఉండడం అందుకు నిదర్శం.
అరంగేట్రంలోని 5 వికెట్లు పడగొట్టి మీ సత్తాను ప్రపంచానికి తెలియజేశారు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో కూడా మీరు భాగమయ్యారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకోవంలో మీరు కీలక పాత్ర పోషించారు. క్రికెట్ పట్ల మీకెంతో అంకితభావం ఉంది
మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ జట్టు ప్రయోజనాల కోసం ఆడావు. చెన్నైలో వరదల సమయంలో కుటుంబ సభ్యులతో కాకుండా జట్టుతోనే ఉన్నావు. నిజంగా మీరు ఒక లెజెండ్. మీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అంత మంచి జరగాలని కోరుకుంటున్నా. అల్ ది బెస్ట్ అంటూ అశ్విన్‌కు రాసిన లేఖలో మోదీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment