Legends League Cricket: Sourav Ganguly Issues Clarification Over His Participation - Sakshi
Sakshi News home page

Sourav Ganguly: 'ఆ టీ20 లీగ్‌లో నేను భాగం కావడం లేదు.. అవన్నీ రూమర్సే'

Published Thu, Jul 21 2022 9:03 AM | Last Updated on Thu, Jul 21 2022 11:30 AM

Sourav Ganguly issues clarification over his participation in Legends League Cricket - Sakshi

లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో తాను భాగం కానున్నట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తోసిపుచ్చాడు. కాగా లెజెండ్స్ లీగ్ రెండో సీజన్‌లో గంగూలీ ఆడనున్నాడంటూ టోర్నీ నిర్వహకులు బుధవారం ట్విటర్‌లో ఓ పోస్టును షేర్‌ చేశాడు. ఈ వార్త పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై గంగూలీ స్పందించాడు. లెజెండ్స్ లీగ్‌తో తాను భాగం కావడం లేదని, అవి అన్ని రూమర్సే అని గంగూలీ కొట్టి పారేశాడు.

"ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు. నేను  లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడటం లేదు అని"  పిటిఐతో గంగూలీ పేర్కొన్నాడు. ఇక టోర్నమెంట్‌ ఒమెన్‌ వేదికగా సెప్టెంబర్‌ 20 నుంచి ఆక్టోబర్‌ 10 వరకు జరగనుంది. ఈ టోర్నీలో వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్, ఇయాన్ మోర్గాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజ క్రికెటర్‌లు భాగం కానున్నారు.


చదవండి: IND vs WI: జిమ్‌లో తెగ కష్టపడుతున్న రాహుల్‌.. వీడియో వైరల్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement