వన్డే ప్రపంచకప్-2023కు భారత్ అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఐసీసీ ప్రకటించింది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న చెన్నై వేదికగా తలపడనుంది.
కాగా ప్రపంచకప్‌కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ.. సెమీఫైనల్‌కు చేరే జట్లను, ఫైనలిస్టులను మాజీలు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు చేరే తన ఫేవరెట్ జట్లను గంగూలీ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు భారత్ జట్లు కచ్చితంగా సెమీఫైనల్లో అడుగుపెడతాయని గంగూలీ జోస్యం చెప్పాడు.
ఇటువంటి మెగా టోర్నీలో సెమీ ఫైనల్‌కు చేరే జట్లను అంచనా వేయడం చాలా కష్టం. నా వరకు అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్ జట్లు కచ్చితంగా సెమీఫైనల్స్‌కు చేరుతాయాని భావిస్తున్నాను. అదే విధంగా రన్నరప్ న్యూజిలాండ్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం.
కాబట్టి న్యూజిలాండ్‌తో పాటు పాకిస్తాన్ కూడా సెమీ ఫైనల్లో అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈడెన్ గార్డెన్స్ జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్- భారత జట్లు తలపడాలని ఆశిస్తున్నాని రెవ్‌స్పోర్ట్జ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.
చదవండి: Womens Ashes 2023: యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి
Comments
Please login to add a commentAdd a comment