Rashmika Mandanna Talk About Ex-Boyfriend Rakshit Shetty Paramvah Studios Production - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: అప్పుడు సో కాల్డ్‌ అంటూ కామెంట్స్‌.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడికి క్రెడిట్‌..

Mar 23 2023 10:18 AM | Updated on Mar 23 2023 3:08 PM

Rashmika Mandanna About Ex Boyfriend Rakshit Shetty Production - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక ప్రస్తుతం చేతి నిండ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో పుష్ప 2తో పాటు హిందీలో పలు ప్రాజెక్ట్స్‌ చేస్తోంది. కన్నడ నటి అయిన రష్మిక తెలుగులో చక్రం తిప్పుతొంది. ఇక ఇటీవల బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన తాజాగా ఓ ఇంటర్య్వూలో చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. గతంలో తనకు నటిగా తొలి అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్‌ హౌజ్‌ పేరు చేప్పేందుకు ఆసక్తి చూపని ఆమె ఏకంగా తన మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టికి క్రెడిట్‌ ఇచ్చింది. దీంతో రష్మిక కామెంట్స్‌ దక్షిణాన చర్చనీయాంశమయ్యాయి.

చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు..

ఈ మేరకు తాజా ఇంటర్య్వూలో రష్మిక మాట్లాడుతూ.. ‘‘నేను నటిని అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ, చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే నటిని కావాలని కొన్ని సినిమా ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. నిరాశతో వెనక్కి వచ్చేదాన్ని. నటన అనేది నాకు సెట్‌ కాదని, అది నాకు రాసి పెట్టి లేదని అనుకునేదాన్ని. అలాంటి సమయంలో ఓ అందాల పోటీలో పాల్గొన్నా. ఈ పోటీలో గెలిచి టైటిల్‌ సొంతం చేసుకున్నా. దీంతో నా ఫొటో అన్ని పత్రికల్లో వచ్చింది. దానిని చూసి పరంవా స్టూడియోస్‌ (రక్షిత్‌ శెట్టికి సంబంధించిన నిర్మాణ సంస్థ) నుంచి కాల్‌ వచ్చింది. వాళ్లు తెరకెక్కిస్తోన్న ‘కిరిక్‌ పార్టీ’లో నాకు లీడ్‌ రోల్‌ ఆఫర్‌ చేశామని దర్శక- నిర్మాతలు చెప్పారు. అలా, నటిగా నా తొలి అడుగు పడింది’’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శిస్తూ పాట పాడిన ప్రముఖ సింగర్‌ కన్నుమూత

కాగా కాంతార మూవీ సమయంలో రష్మిక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  ఓ ఇంటర్య్వూలో నటిగా తనకు కెరీర్‌ ఇచ్చిన ప్రొడక్షన్‌ హౌజ్‌ చెప్పకుండ సో కాల్డ్‌ ప్రొడక్షన్‌ అని వ్యాఖ్యానించింది. దీంతో కన్నడ నాట ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. శాండల్‌వుడ్‌ సినీప్రముఖులు సైతం రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నిర్మాణ సంస్థ పేరు చెప్పడంతో ఎట్టకేలకు రష్మిక దిగొచ్చిందంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుంటే ఆమె ఫ్యాన్స్‌ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కిరిక్‌ పార్టీ సమయంలో ప్రేమలో పడిని రక్షిత్‌ శెట్టి-రష్మికలు ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement