Hero Nani Shared About Dasara Movie Scene For Which He Feared - Sakshi
Sakshi News home page

Nani: ఆ సంఘటన చాలా భయపెట్టింది, రెండు నెలలు నిద్రపట్టలేదు: నాని

Published Thu, Mar 16 2023 2:41 PM | Last Updated on Thu, Mar 16 2023 3:21 PM

Hero Nani Shared About Dasara Movie Scene Which He Feared - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న విడుదలకు సిద్ధమైంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మూవీ విశేషాలను పంచుకున్నాడు.

చదవండి: నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్‌ ఇచ్చాడు: నటుడు

ఈ సందర్భంగా దసరాలోని ఓ సన్నివేశం తనని చాలా ఇబ్బంది పెట్టిందని, దాని వల్ల రెండు నెలల సరిగా నిద్రపోలేదంటూ ఆసక్తిర విషయాన్ని బయటపెట్టాడు. ఈ మేరకు నాని మాట్లాడుతూ.. ‘డంపర్ ట్రక్ బోగ్గును తీసుకుని వెళ్లి డంప్ చేస్తుంటుంది. దీనిక సంబంధించిన సీన్‌లో నేను ఆ డంపర్ ట్రక్‌లో నుంచి కిందపడితే ఆ బొగ్గు నాపై పడాలి. దీని కోసం సింథటిక్ బొగ్గు రెడీ చేశారు. అది మొత్తం డస్ట్‌తో ఉంటుంది’ అన్నాడు. అలాగే ‘ఆ సీన్‌లో నేను ఆ డంపర్‌లో నుంచి క్రింద పడిపోయాను. 

చదవండి: చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు

సింథటిక్ కోల్స్ కింద నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్‌లో నేను గాలి పీల్చకుండా ఉండాలి. పీల్చితే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది. ఈ సీన్ షూటింగ్ అయ్యాక చాలా రోజుల పాటు డంప్‌లో నుంచి బొగ్గుతో పాటు నేను పడటం.. బొగ్గు నాపై పడటం.. నన్ను పైకి లాగడం.. ఇవన్నీ నాకు పదే పదే గుర్తుకొచ్చేవి. అది గుర్తోచ్చినప్పుడల్లా లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. ఈ క్రమంలో తెలియకుండానే నేను శ్వాస ఆపడం చేస్తుండేవాడిని. దాని నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. దీనివల్ల రెండు నెలల పాటు సరిగా నిద్రపట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement