
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ బీఆర్‌ఎస్ పార్టీలో కాకరేపుతున్నాయి. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మల్లారెడ్డిలు ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. ఈటలను చూసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన వద్దకు వెళ్లి నువ్వే గెలుస్తున్నవన్నా అంటూ చేసిన వైరల్‌గా మారాయి.
ఈటలను అలింగనం చేసుకోవడమే కాక, ఫోటో తీయండయ్య అన్న తోటి అంటూ ఉత్సాహంగా ఫొటోలు దిగారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. మల్కాజిగిరిలో బీఆర్‌ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి పట్నం సునితా మహేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి తమ ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటలనే గెలుస్తున్నారంటూ చెప్పడం చర్చాంశనీయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment