Rashmika Mandanna Completes 6 Years In Film Industry - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: అది నా అదృష్టం: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

Published Tue, Jan 17 2023 8:39 AM | Last Updated on Tue, Jan 17 2023 9:05 AM

Rashmika Mandanna Completes 6 Years in Film Industry - Sakshi

సినిమారంగంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుస విజయాల బాటలో కొనసాగుతున్న హీరోయిన్‌ రష్మిక మందన్నా. శాండిల్‌వుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఈమె హవా కొనసాగిస్తోంది. కోలీవుడ్‌లో తాజాగా రష్మిక నటించిన తమిళ-తెలుగు చిత్రం వారిసులో నటుడు విజయ్‌తో రొమాన్స్‌ చేసింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా రష్మిక తన అనుభవాలను మీడియాతో పంచుకుంది. తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 6 ఏళ్లు అయిందని, ఎంతోమంది ప్రతిభావంతమైన, అందమైన నటీమణులు ఉన్నా కూడా తనకు అన్ని భాషల్లోనూ అవకాశాలు లభించడం తన అదృష్టమని చెప్పింది.

చదవండి: చిరంజీవి మెసేజ్‌లను అవాయిడ్‌ చేసిన స్టార్‌ యాంకర్‌! అసలేం జరిగిందంటే..

తన శ్రమకు తోడు దర్శక నిర్మాతల సహకారం, ప్రేక్షకుల అభిమానం, అన్నిటికీ మించి భగవంతుని ఆశీస్సులతోనే ఇన్ని విజయాలు వరించాయనంటోంది. తాను ఇతరుల సమయాన్ని, ప్రయత్నాలను గౌరవిస్తాను అని, ఒక నటిగా నిత్యం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటానని తెలిపింది. సాధ్యమైనంత వరకు అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పింది. నటుడు విజయ్‌కి తాను వీరాభిమానిననీ, అలా నచ్చిన నటుడితో వారిసు చిత్రంలో నటించడం ఎంతో సంతోషాన్ని కలిగిందని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement