Director Vijay Kumar Kalivarapu Comments On Suma Kanakala: ‘‘జయమ్మ పంచాయితీ’లో జయమ్మ పాత్రలో రమ్యకృష్ణగారి లాంటి నటి అయితే బాగుంటుందనుకున్నాను. అయితే నాకు తెలిసినవారు సుమగారి పేరును సజెస్ట్ చేయడంతో ఆమెకి కథ చెప్పాను. ఆమెకు నచ్చడంతో ఓకే చెప్పారు. కానీ ఆమె నటనపై సందేహం కలిగింది. టెస్ట్ షూట్ చేశాక నమ్మకం వచ్చింది’’ అన్నారు విజయ్ కుమార్ కలివరపు. యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. స్టార్ హీరోలతో పని చేయాలనుకున్నాను. అయితే అది అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి చాలా సమయం పట్టింది. కొందరు వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది రాసుకున్న కథే ‘జయమ్మ పంచాయితీ’. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన జయమ్మ తన గ్రామంలో ఇబ్బందులకు గురవుతుంది. ఆమె చేసే పోరాటం పెద్ద వివాదంగా మారుతుంది. అది ఏంటి? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పించలేదు. లొకేషన్లలో సింక్ సౌండ్ వాడాం. కీరవాణిగారు మా చిత్రానికి సంగీతం అందించడం సినిమా విజయంపై నాకు మరింత నమ్మకాన్నిచ్చింది’’ అన్నారు.
చదవండి: రాజీవ్‌తో విబేధాలపై స్పందించిన యాంకర్ సుమ
Comments
Please login to add a commentAdd a comment