Suma Gives Clarity On Will Stop Anchoring After Jayamma Panchayati, Details Inside - Sakshi
Sakshi News home page

Suma Kanakala: సుమ యాంకరింగ్‌ను వదిలేస్తుందా? ఆమె ఏం చెప్పిందంటే..

Published Fri, May 6 2022 1:34 PM | Last Updated on Fri, May 6 2022 3:12 PM

Will Suma Kanakala Stop Anchoring After Jayamma Panchayati Here Is The Answer - Sakshi

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాల.. తాజాగా ‘జయమ్మ పంచాయితీ’సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. విజయ్‌ కలివారపు దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి నుంచి సినిమాల్లోనూ నటిస్తానని స్వయంగా సుమ పేర్కొన్న సంగతి తెలిసిందే.

దీంతో యాంకరింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తుందా అన్న అనుమానాలు రేకెత్తాయి. తాజాగా ఈ విషయంపై సుమ స్పందించింది. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ.. బుల్లితెరను వదిలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. తనకు అన్నం పెట్టిన బుల్లితెర తల్లితో సమానమని, వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సినిమాలతో పాటు బుల్లితెరపై కంటిన్యూ అవుతానని వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement