
యాంకర్ సుమ. ఈమె హోస్టింగ్‌కు సాధారణ జనాలే కాదు సెలబ్రిటీలు సైతం జై కొడుతుంటారు. వరుస షోలు చేస్తూ బుల్లితెర మహారాణిగా పేరు తెచ్చుకున్న సుమ వీలు చిక్కినప్పుడల్లా కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే ఈసారి సహాయక పాత్రల్లో కాకుండా ఏకంగా లీడ్ రోల్‌లో నటించింది సుమ. దీనికి 'జయమ్మ పంచాయితీ' అని టైటిల్ ఫిక్స్ చేశారు. విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాశ్ నిర్మించారు. ఈ సినిమాకుగానూ సుమ ఓ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుందట! ఒకరోజు హోస్టింగ్‌కు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా తీసుకునే సుమ ఇప్పుడీ సినిమా కోసం ఏకంగా యాభై లక్షలు డిమాండ్ చేసిందని టాక్. తనకున్న క్రేజ్‌ను బట్టి అంత మొత్తం ఇవ్వడానికి కూడా వెనుకాడట్లేదట నిర్మాతలు.
ఇప్పటికే సుమకున్న పాపులారిటీతో సినిమా చుట్టూ మంచి బజ్ ఏర్పడింది. గతంలో రిలీజైన టీజర్ కూడా వినోదాత్మకంగా ఉండటంతో మూవీ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి చాలాకాలానికి వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న సుమ 'జయమ్మ పంచాయితీ'తో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment