జగపతిబాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్‌దాస్, గానవి లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రుద్రంగి. ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. జూలై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం (జూన్ 29న) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై ఉన్న యాంకర్ సుమపై ఆయన సెటైర్లు వేశారు.
ముందుగా రుద్రంగి సినిమాను తన భుజాలపై వేసుకుని ప్రమోష్స్ చేస్తున్న జగపతిబాబుపై ప్రశంసలు కురిపించింది సుమ. అతడిని మాట్లాడాల్సిందిగా కోరుతూ మైక్ జగపతిబాబు చేతికి అందించింది. జగపతిబాబు స్పీచ్ మొదలుపెట్టేలోపు పక్కనే ఉన్న బాలయ్య ఏయ్, ఆపు.. ముందు మాట్లాడనివ్వు.. ఓ లొడలొడా వాగేస్తున్నావ్.. అన్నాడు. దీంతో సుమ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ స్టేజీ పై నుంచి వెళ్లిపోయింది. తర్వాత కాసేపటికే స్టేజీపైకి వచ్చిన ఆమె.. బాలకృష్ణను మాట్లాడాల్సిందిగా కోరుతూ అతడి చేతికి మైక్ ఇచ్చింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. 'బాలయ్యబాబు సెక్సీ అంటే విమలా రామన్, మమతా మోహన్‌దాస్.. వాళ్లంతా ఎంత జెలసీగా ఫీలవుతారు? కదా! అయినా ఇంతకుముందు సుమ ఒక మాట అంది. నేను ఏమీ మాట్లాడకముందే అభిమానులు చప్పట్లు కొడతారంది. ఈవిడకు అప్పుడప్పుడూ చెంపదెబ్బలు అవసరం. కానీ ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఈమె తిరిగి చెప్పు తీసుకుని కొడుతుంది.. అదొక బాధ మళ్లీ! పాపం రాజీవ్ కనకాల ఎలా భరిస్తున్నాడో..' అంటూ సుమను టీజ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment