Prakash Raj Says Some Actors Did Not Work With Him Due To His Politics Issue, Deets Inside - Sakshi
Sakshi News home page

Prakash Raj: నటులకు ఆ భయం పట్టుకుంది: ప్రకాశ్‌ రాజ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published Tue, Nov 15 2022 12:27 PM | Last Updated on Tue, Nov 15 2022 1:14 PM

Prakash Raj Says Lots of People Did Not Work With Him Due His Politics Issue - Sakshi

తనతో కలిసి నటించేందుకు వెనకాడుతున్నారంటూ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ మధ్య ప్రకాశ్‌ రాజు సినిమాల కంటే రాజకీయ అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని, మోదీ సర్కార్‌ టారెట్‌ చేస్తూ ఆయన ట్వీట్స్‌ చేస్తున్నారు. 2019లో ఆయన బెంగళూరు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆయన రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అదే ఆసక్తి తన సినీ కెరీర్‌ను దెబ్బతీసేలా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

చదవండి: అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ

ఇటీవల ఓ ఇంగ్లీష్‌ చానల్‌తో ముచ్చటించిన ఆయన తన సినీ కెరీర్‌పై రాజకీయ ప్రభావం పడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు కొందరు నాతో కలసి పనిచేయడం లేదు. నాతో కలసి నటించొద్దని వారికి చెప్పడం వల్ల కాదు. నాతో పనిచేస్తే వారిని యాక్సప్ట్ చేయరేమోనన్న భయం పట్టుకుంది. అలాంటి వారందరినీ కోల్పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా భయం మరొకరికి శక్తిగా కాకూడదనుకుంటాను. అందుకే ఎలాంటి పరిణామాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళతాను.

చదవండి: కృష్ణ చనిపోయారని బాధపడకండి, స్వర్గంలో ఆమెతో కలిసి..: వర్మ ట్వీట్‌

వాటిని స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధమే’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ‘నేను వీటి విషయంలో కొంచెం కూడా విచారించడం లేదు. నటపైనే దృష్టి పెడుతున్నాను. నేను ఇప్పుడు మరింత స్వేచ్ఛగా భావిస్తున్నాను. ఎందుకంటే, నేను నా స్వరాన్ని వినిపించకపోతే కేవలం ఓ మంచి నటుడిగానే చనిపోతాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే చాలా మంది నటులు మౌనంగా ఉంటున్నారని, అందుకు తాను వారిని నిందించాలని అనుకోవడం లేదన్నారు. ఎందుకుంటే మాట్లాడడం వల్ల వచ్చే పరిణామాలను వారు తట్టుకోలేరంటూ ప్రకాశ్‌ రాజ్‌ అసహనం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement