శివాజీనగర: ఈసారి కూడా ఫలితాలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవటంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి తమ షరతులకు ఆమోదిస్తే సంకీర్ణానికి సిద్ధమనే సందేశాన్ని పంపినట్లు తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కుమారస్వామి...తమకు 50 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాము విధించే షరతులకు అంగీకరించే పార్టీలతో పొత్తు సిద్ధమని తెలిపారు.
సంకీర్ణ ప్రభుత్వం ద్వారా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి..పలు పర్యాయాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో ఈసారి స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలకు జలవనరుల, విద్యుత్, ప్రభుత్వ పనుల శాఖలు ఇవ్వాలి. జేడీఎస్ ప్రణాళికా అంశాలను అమలులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఇవ్వాలని తదితర షరతులు పెట్టనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment