Naga Chaitanya About Thank You Movie: అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే ఇటీవల ఈ మూవీ ట్రైలర్ లాంచ్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో నాగ చైతన్య పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నాడు.
''థ్యాంక్యూ కథ అభిరామ్ అనే వ్యక్తి ప్రయాణం. ఈ పాత్రలో శారీరకంగా, మానసికంగా పలు భిన్నమైన షేడ్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఆడియెన్స్‌ను ఎలా కట్టిపడేస్తాయో ఈ అభిరామ్ ప్రయాణం అలానే కట్టిపడేస్తుంది. ఇలాంటి మంచి పాత్రలు ఏ యాక్టర్‌కైనా చాలా అరుదుగా వస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ విక్రమ్, నిర్మాత దిల్ రాజుకు కృతజ్ఞతలు. ఈ స్క్రిప్ట్ వినగానే 'జీవితంలో ఫలానా వారు మనకు స్పెషల్. వారికి ఫోన్ చేసి థ్యాంక్యూ చెప్పాలి' అనే ఫీలింగ్ మా అందరికీ కలిగింది. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుందనే నమ్మకం ఉంది. రాశీఖన్నా రోల్‌తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆమె లేకపోతే ఈ చిత్రమే లేదు'' అని నాగ చైతన్య తెలిపాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా..
ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ !
ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment