Akkineni Naga Chaitanya's First Look From Thank You Movie - Sakshi
Sakshi News home page

Naga Chaitanya Thank You: హ్యాపీ మూడ్‌లో చై, ఆకట్టుకుంటున్న లుక్‌

Published Wed, Nov 24 2021 8:23 AM | Last Updated on Wed, Nov 24 2021 10:58 AM

Naga Chaitanya First Look Release From Thank You Movie - Sakshi

హీరో నాగచైతన్య-రాశి ఖన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ రూపొందింది. దిల్ రాజు - శిరీష్‌లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక నాయర్, అవికా గోర్‌లు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి చై లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌. నవంబర్‌ 23 నాగ చైతన్య బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌తో పాటు ఫస్ట్‌ గ్లింప్స్‌ను పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. 

ఈ పోస్టర్‌ చూస్తుంటే చై తిరునాళ్లలో కొయ్య గుర్రంపై ఎక్కి కేరింతలు కొడుతూ చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. విక్రమ్ కుమార్ తయారు చేసుకున్న ఈ కథ .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. అయితే ఇంతవరకూ ఆయన తన సినిమా నుంచి పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు. చాలా సైలెంట్ గా ఆయన తనపని చేసుకుంటూ వెళుతున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? ఎప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలుపెడతారు? అనే విషయాలు అధికారికంగా వెలువడవలసి ఉంది. కాగా ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించాడు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement