Thank You Movie Expected OTT Release Date, Check Streaming Platforms - Sakshi
Sakshi News home page

Thank You OTT Release Date: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Published Tue, Aug 2 2022 1:04 PM | Last Updated on Tue, Aug 2 2022 1:50 PM

Naga Chaitanya Thank You Movie Streaming on This Two OTT Platforms Soon - Sakshi

అక్కినేని హీరో నాగచైతన్య ‘లెటేస్ట్‌’ మూవీ థ్యాంక్యూ.  విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు. లవ్ అండ్ ఎమోషనల్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటించగా.. అవికా గోర్‌లో ముఖ్య పాత్ర  పోషించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం థియేటర్లో నడుస్తున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్‌ కామెంట్స్‌ వైరల్‌ 

బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోందట. ఈ మూవీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను డిజిటల్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రైం సొంతం చేసుకున్నట్లు  తెలుస్తోంది. అలాగే సన్‌ నెక్ట్‌ కూడా మంచి రేటుకే స్ట్రీమింగ్‌ రైట్స్‌ పొందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్‌ రెండో వారం లేదా మూడో వారంలో ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానుందని వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ‘థ్యాంక్యూ’ ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. కాగా దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement