అభిమానులకు నాగచైతన్య బిగ్ సర్‌ప్రైజ్.. ఏం చేశారంటే? | Naga Chaitanya Gives Big Surprise To His Fans In Tollywood As Part Of Dhootha Promotions, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: అభిమానులకు చైతూ బిగ్ సర్‌ప్రైజ్.. ఏం చేశారో తెలుసా?

Nov 21 2023 4:28 PM | Updated on Nov 21 2023 5:13 PM

Naga Chaitanya Gives Big Surprise To His Fans In Tollywood - Sakshi

ఈ ఏడాది కస్టడీ సినిమాతో అభిమానులను అలరించిన అక్కినేని హీరో నాగచైతన్య. వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా.. ప్రియమణి కీలకపాత్రలో కనిపించారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించారు. 

అయితే ఇప్పటికే చాలామంది హీరోలు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వగా.. చైతూ సైతం సరికొత్త సిరీస్‌తో అరంగేట్రం చేస్తున్నారు. నాగచైతన్య ప్రధానపాత్రలో నటించిన వెబ్ సిరీస్ దూత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సిరీస్‌ డిసెంబర్‌ 1న విడుదల కానుంది. ఇందులో భాగంగానే ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయారు నాగచైతన్య. అయితే ఈ వెబ్ సిరీస్‌ కోసం సరికొత్త పంథాలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈనెల 23న చైతూ బర్త్‌ డే కావడంతో స్పెషల్‌ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. తన అభిమానుల కోసం సరికొత్తగా సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేశారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. 

సాధారణంగా తన అభిమాన హీరోను కలవాలంటే మనమే వాళ్ల ఇంటికి వెళ్తాం. కానీ ఇక్కడ నాగచైతన్యనే స్వయంగా అభిమానుల ఇంటికి వెళ్లి వారికి ఆశ్చర్యానికి గురి చేశారు. అంతే కాకుండా వారికి గిఫ్ట్ బాక్సులు కూడా అందజేశారు. దీంతో అభిమాన హీరోనే స్వయంగా తమ ఇంటికి రావడంతో ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. ఫ్యాన్స్‌ను కలిసిన చైతూ వారితో కాసేపు మాట్లాడారు.

ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ..'పర్సనల్‌గా నాకు సంతృప్తినిచ్చిన వెబ్ సిరీస్ ఇది. ఈ జోనర్‌ను నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ సిరీస్ ‍కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ సిరీస్ ట్రైలర్‌ను నాగచైతన్య బర్త్‌ డే సందర్భంగా ఈ నెల 23న రిలీజ్ చేయనున్నారు.

కాగా.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ కానుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్‌ రానుంది. శరద్‌ మరార్‌ నిర్మించిన ఈ సిరీస్‌కు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. ఆయన నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' సినిమాలు చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్‌, ప్రాచీ దేశాయ్‌, తరుణ్‌ భాస్కర్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement