Dhoota Web Series
-
ఓకే ఈవెంట్లో సందడి చేసిన సామ్- చైతూ.. కాకపోతే!
హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో అగ్ర కథానాయకిగా రాణించిన ఈమె సినీ, వ్యక్తిగత జీవితాలు రెండు సంచలనమే. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. అదే విధంగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సిటాడెల్ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ నిర్వహించిన ఈవెంట్లో సందడి చేసింది సామ్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది తమ ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధింటిన వివరాలను ఈ గ్రాండ్ ఈవెంట్లో వెల్లడించింది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటాడెల్ సిరీస్ కూడా ఉంది. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ పేరును కూడా మార్చేశారు. సిటాడెల్: హనీ బన్నీ పేరును ఖరారు చేశారు. సిటాడెల్ యూనివర్స్‌లో హనీ బన్నీ ఇండియన్ సిరీస్ అనే క్యాప్షన్‌తో సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఊహించని విధంగా ఈ ఈవెంట్లో అక్కినేని హీరో నాగచైతన్య కూడా సందడి చేశారు. గతేడాది తాను నటించిన సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈవెంట్లో వెబ్ సిరీస్ టీమ్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోను అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్ట్ చేసింది. తెలుగు మోస్ట్ సక్సెస్ఫుల్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా దూత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయితే చాలా రోజుల తర్వాత నాగచైతన్య, సమంత ఓకే ఈవెంట్లో కనిపించారు. విడిపోయాక వీరిద్దరు కలిసి ఈవెంట్స్‌లో కనిపించడం చాలా అరుదు. గతంలో వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీరిద్దరు పాల్గొన్నట్లు సమాచారం. కానీ చాలా రోజుల తర్వాత ఓకే ఈవెంట్లో ఈ జంట మెరిసింది. అయితే ఇద్దరు కూడా వేరు వేరుగా తమ మూవీల ప్రమోషన్స్‌లో భాగంగానే ఈవెంట్‌కు హాజరయ్యారు. విడివిడిగానైనా చై- సామ్ ఓ ఈవెంట్‌కు హాజరు కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. our homegrown spy 🔎 #SamanthaRuthPrabhu #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/Cd8U5RE5df — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 Celebrating #DhoothaOnPrime - Our most successful Telugu Original series.#AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/PeZ6I8bZlb — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
ఓటీటీలో మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు వెబ్ సిరీస్ ఏదో తెలుసా!
ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తూ అదరగొడుతున్నారు. గతేడాది నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ దూత. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 1న స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఎనిమిది ఎపిసోడ్లుగా వచ్చిన ఈ సిరీస్‌ను శరద్ మరార్ నిర్మించారు. ఈ సిరీస్‌కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలుగులో అత్యంత సక్సెస్‌ఫుల్‌గా నిలిచిన వెబ్ సిరీస్‌గా ఘనతను సొంతం చేసుకుంది. ఇవాళ ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రైమ్ వీడియో ప్రజెంట్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేదికపై నాగచైతన్యతో పాటు ఈ సిరీస్ దర్శక, నిర్మాతలు కూడా పాల్గొన్నారు. కాగా.. ఇటీవలే ఈనెల 19న దూత సీజన్-2 గురించి హింట్ ఇచ్చారు నాగచైతన్య. కానీ అప్డేట్ అయితే రాలేదు.. దూత సిరీస్ మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు సక్సెస్ఫుల్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా నిలిచింది. Celebrating #DhoothaOnPrime - Our most successful Telugu Original series.#AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/PeZ6I8bZlb — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
38 భాషల సబ్ టైటిల్స్‌తో 240 దేశాల్లో ‘దూత’.. ఆనందంగా ఉంది: నిర్మాత
‘‘దూత’ వెబ్ సిరీస్‌ని అమేజాన్ సంస్థ వారు 38 భాషల్లో సబ్ టైటిల్స్‌తో 240 దేశాల్లో విడుదల చేశారు. వీక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో నాగచైతన్య, విక్రమ్, నేను.. ఇలా ‘దూత’ టీమ్ అంతా చాలా ఆనందంగా ఉన్నాం’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘దూత’. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్పై శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 1 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. ఈ సందర్భంగా శరత్ మరార్ మాట్లాడుతూ– ‘‘విక్రమ్ చెప్పిన ‘దూత’ ఆలోచన, కథాంశం చాలా నచ్చింది. ఈ కథకి నాగచైతన్యనే మొదటి ఎంపిక. ఆయనకు ఇది తొలి వెబ్ సిరీస్. కథ వినగానే చేద్దామన్నారు. సినిమా, వెబ్ సిరీస్.. ఏదైనా నిర్మాణం అనేది సవాల్‌తో కూడుకున్న వ్యాపారం. ప్రస్తుతం నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్పై రెండు చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: 'దూత' వెబ్ సిరీస్ నటీనటులు: నాగచైతన్య, ప్రియ భవాని శంకర్, పార్వతి తిరువతు, పశుపతి తదితరులు నిర్మాత: నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ డైరెక్టర్: విక్రమ్ కే కుమార్ మ్యూజిక్: ఇషాన్ చబ్రా సినిమాటోగ్రఫీ: మికాలాజ్ సైగుల విడుదల తేదీ: 2023 డిసెంబర్ 01 ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో ఎపిసోడ్స్: 8 స్టార్ హీరోల సినిమాలు కరోనా టైంలో డైరెక్ట్ ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి గానీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నేరుగా మన తెలుగు హీరోలు నటించలేదు. ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైతన్య.. తొలిసారి ఓ వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. 'దూత' పేరుతో దీన్ని వెబ్ సిరీస్ గా తీశారు. తాజాగా ఇది ఓటీటీలో రిలీజ్ అయింది. థ్రిల్లర్ కథతో తీసిన ఈ సిరీస్ ఎలా ఉంది? టాక్ ఏంటనేది? ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి? సాగర్ వర్మ(నాగ చైతన్య) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. విలువలు కంటే డబ్బే ముఖ్యం. కొత్తగా పెట్టిన 'సమాచార పత్రిక' న్యూస్ పేపర్ కి చీఫ్ ఎడిటర్ గా అప్పాయింట్ అవుతాడు. ఈ బాధ్యతలు అందుకున్న కాసేపటి తర్వాత చిన్న పేపర్ క్లిప్ దొరుకుతుంది. సాగర్ కారుకి ఏక్సిడెంట్ అయ్యి అందులో కుక్క చనిపోతుంది అని రాసి ఉంటది. సాగర్ ఇది చదివిన క్షణాల్లోనే అలానే ప్రమాదం జరుగుతుంది. ఇలానే పేపర్ క్లిప్స్ సాగర్ కి దొరకడం, అతడి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వరసగా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకీ వీళ్ళ చావులకి, పేపర్ క్లిప్స్ తో సంబంధం ఏంటి? వీళ్లనే ఎందుకు చంపుతున్నారు? డీసీపీ క్రాంతి(పార్వతి), సత్యమూర్తి (పశుపతి)కి సాగర్ తో లింక్ ఏంటి అనేదే 'దూత' స్టోరీ. ఎలా ఉంది? తన ఫ్రెండ్ అయిన జర్నలిస్ట్ కాసేపట్లో చనిపోతాడని హీరో జర్నలిస్ట్ కి తెలుస్తుంది. దీంతో భయపడతాడు. పరిగెత్తుకుని మరి వెళ్లి అతడి చావుని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ తన కళ్ళ ముందే.. జర్నలిస్ట్ ఫ్రెండ్ నోట్లో గన్ పెట్టుకుని కాల్చుకుని చనిపోవడం హీరో చూస్తాడు. ఇది ఒక్కటే కాదు ప్రతిసారీ ఎవరో ఒకరు చనిపోతారని ముందు తెలియడం, వాళ్ళని కాపాడటానికి వెళ్లేలోపు వాళ్ళు చనిపోవడం.. చదువుతుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది కదా.. స్క్రీన్ పై చూస్తుంటే ఇంకా మజాగా ఉంటుంది. దూత సిరీస్ గురించి సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే. స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుని హీరో సాగర్ చనిపోవడానికి ట్రై చేసే సీన్ తో ఈ వెబ్ సిరీస్ మొదలవుతుంది. కట్ చేస్తే టైటిల్స్ పడతాయి. స్టోరీ ఆరు రోజులు క్రితానికి వెళ్తుంది. 'సమాచార పత్రిక ' న్యూస్ పేపర్ లాంచ్, దీనికి చీఫ్ ఎడిటర్ గా సాగర్ నియామకం, కాసేపటి తర్వాత ఫ్యామిలీతో కలిసి సాగర్... కార్ లో ఇంటికి రిటర్న్ వెళ్తుండగా ఓ దాబా దగ్గర కారు ఆగిపోతుంది. పక్కనే ఉన్న హోటల్ కి సాగర్ వెళ్తే అక్కడ.. కాసేపట్లో తన కార్ కి ఏక్సిడెంట్ అవుతుందని, కుక్క చనిపోతుందని ఉంటుంది. సరిగ్గా అలానే జరుగుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే స్టోరీ పరిగెడుతుంది. కుక్క దగ్గర నుంచి స్టార్ట్ అయినా చావులు.. ఓ లారీ డ్రైవర్, యూట్యూబర్.. ఇలా ఎపిసోడ్ కి ఒకటి చొప్పున జరుగుతుంటాయి. మరోవైపు సాగర్ ఓ హత్య చేస్తాడు. అతడ్ని అరెస్ట్ చేయాలని డీసీపీ క్రాంతి.. ఆధారాలు సేకరించే పనిలో ఉంటది. ఇంతకీ ఈ హత్యలకు.. అప్పుడెప్పుడో స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఉన్న 'దూత' అనే న్యూస్ పేపర్ కి లింక్ ఏంటనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. అయితే ఈ సిరీస్ లో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే.. మొదట్లో కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు వున్నాయా అనిపిస్తుంది. కానీ చివరి రెండు ఎపిసోడ్స్ లో మొత్తం లింక్స్ అన్ని డైరెక్టర్ కనెక్ట్ చేసిన తీరు మంచి హై ఇస్తుంది. ఇక వెబ్ సీరీస్ లో 'f వర్డ్' తో పాటు ఓ బూతు పదేపదే వినిపిస్తుంది. కానీ కథకి అది ఏం ఇబ్బంది అనిపించదు. అలానే సిరీస్ లో చూపించే చావులన్ని కొంచెం హారిబుల్ గా ఉంటాయి. వీటికి ముందే ప్రిపేర్ అయితే సిరీస్ తెగ నచ్చేసింది. ఎవరెలా చేశారు? నాగ చైతన్యకి ఇది ఓటీటీ ఎంట్రీ. ఫస్ట్ వెబ్ సిరీస్ తోనే హిట్టు కొట్టేశాడు. సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో సెటిల్డ్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. డీసీపీ క్రాంతిగా మలయాళ నటి పార్వతి తిరువత్తు.. బాగా చేసింది. సాగర్ భార్య ప్రియాగా చేసిన ప్రియ భవాని శంకర్ కూడా ఉన్నంతలో అలరించింది. ఇకపోతే డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్రహ్మీ కొడుకు రాజ గౌతమ్ కనిపించింది కాసేపే అయిన నెగటివ్ రోల్స్ లో డిఫెరెంట్ గా కనిపించారు. మిగిలిన వాళ్ళందరూ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ విషయాలకు వస్తే.. డైరెక్టర్ అండ్ రైటర్ విక్రమ్ కే కుమార్ ని మెచ్చుకుని తీరాలి. చాలా రోజుల తర్వాత తను గతంలో తీసిన '13B' లాంటి థ్రిల్లర్ కథతో కేక పుట్టించారు. సిరీస్ లో సీన్స్ అన్ని కూడా నైట్, వర్షంలోనే ఉంటాయి. వాటన్నిటినీ సినిమాటోగ్రాఫర్ బ్యూటిఫుల్ గా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే.. 'binge watch' సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారా.. 'దూత' బెస్ట్ ఆప్షన్. -
దూత ఓ కొత్త అనుభూతి
‘‘థ్యాంక్యూ’ సినిమా తర్వాత ‘దూత’ వెబ్ సిరీస్ గురించి నాగచైతన్యతో చెప్పాను. హారర్, థ్రిల్లర్ నేపథ్యం అంటే నాకు భయం అన్నాడు. కథ వినమన్నాను. ఆ తర్వాత కథ నచ్చడంతో చేస్తానని చెప్పాడు. సూపర్ నేచురల్, ఊహాతీతమైన అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. హీరో నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీశంకర్, ్రపాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ డిసెంబరు 1 నుంచి అమేజాన్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎనిమిది ఎపిసోడ్స్‌గా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ కె. కుమార్ చెప్పిన విశేషాలు. ► ‘దూత’ పూర్తిగా కల్పిత కథ. ‘దూత’ అంటే ఏదైనా సమాచారాన్ని చేరవేసేవాడు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నాగచైతన్య అద్భుతంగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటేనే సవాల్‌తో కూడుకున్నది. సంచలనం సృష్టించిన ఓ ఘటన తాలూకు వాస్తవాలను సాగర్ ఎలా పాఠకుల ముందు ఉంచాడు? ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? అనేది ప్రేక్షకులు అంచనా వేయలేరు. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకి వచ్చి, ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రని సవాల్‌గా తీసుకుని చేశాడు నాగచైతన్య. ►‘దూత’లో మూడు సినిమాలు తీసేంత కథ ఉంది. అందుకే వెబ్ సిరీస్‌గా తీశాం. పైగా సినిమాగా తీస్తే మన ప్రేక్షకులకు మాత్రమే చేరువ అవుతుంది. ఓటీటీలో ప్రసారం చేయడం ద్వారా ఇతర దేశాల్లోని వారు కూడా మన ఇండియన్ వెబ్ సిరీస్‌లు చూసే అవకాశం ఉంటుంది. ►షార్ట్ ఫిలిం, వెబ్ ఫిల్మ్, సినిమా.. దేని కష్టం దానికి ఉంటుంది. అయితే సినిమా తీయడం సులభమే.. కానీ, మంచి మూవీ తీయడం చాలా కష్టం. -
ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలివే!
థియేటర్లలో రిలీజయ్యే సినిమాల సంఖ్య కంటే ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. కొన్ని ఆల్రెడీ బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకున్నాక ఓటీటీలోకి వస్తుంటే.. మరికొన్ని నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లోనే రిలీజవుతున్నాయి. సినిమా, సిరీస్‌లు, షోలు.. ఇలా రకరకాల కంటెంట్‌తో ఓటీటీలు.. సినీప్రియులను ఎప్పటికప్పుడు ఊరిస్తూ హుషారెత్తిస్తున్నాయి. మరి ఈ గురు, శుక్రవారాల్లో (నవంబర్ 30, డిసెంబర్ 1) ఏయే సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనేది చూద్దాం.. అయితే ఈసారి అందరి కన్ను నాగచైతన్య దూత వెబ్ సిరీస్ మీదే ఉంది. చై తొలిసారి నటించిన వెబ్ సిరీస్ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ► అమెరికన్ సింఫనీ (ఇంగ్లీష్ చిత్రం) - నేటి నుంచే స్ట్రీమింగ్ ► బ్యాడ్ సర్జన్: లవ్ అండర్ ద నైఫ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నేటి నుంచే స్ట్రీమింగ్ ► ఫ్యామిలీ స్విచ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 30 ► హార్డ్ డేస్ (జపనీస్ చిత్రం) - నవంబర్ 30 ► ఒబ్లిటెరేటడ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 30 ► ద బ్యాడ్ గాయ్స్: ఎ వెరీ బ్యాడ్ హాలీడే (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబర్ 30 ►వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 30 ► స్కూల్ స్పిరిట్స్, సీజన్ 1 (వెబ్ సిరీస్) - నవంబర్ 30 ► ద బిగ్ అగ్లీ (2020) సినిమా - నవంబర్ 30 ► మామాసపనో: నౌ ఇట్ కెన్ బీ టోల్డ్ (తగలాగ్ సినిమా) - డిసెంబర్ 1 ► మే డిసెంబర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 1 ► మిషన్ రాణిగంజ్: ద గ్రేట్ భారత్ రెస్క్యూ (హిందీ చిత్రం) - డిసెంబర్ 1 ► స్వీట్ హోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 1 ► ద ఈక్వలైజర్ 3 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 1 ► బాస్కెట్‌బాల్ వైవ్స్, 3-4 సీజన్స్ (సిరీస్) - డిసెంబర్ 1 అమెజాన్ ప్రైమ్ ► షెహర్ లఖోట్ (హిందీ వెబ్ సిరీస్) - నవంబర్ 30 ► దూత (తెలుగు వెబ్ సిరీస్) - డిసెంబర్ 1 ► క్యాండీ కేన్ లైన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 1 హాట్‌స్టార్ ► ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 1 ► మాన్స్టర్ ఇన్సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబర్ 1 ► ద షెఫర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 1 ఇవి కాకుండా 'జర హట్కే జర బచ్కే', '800' మూవీస్ డిసెంబర్ 2న జియో సినిమాలో అందుబాటులోకి వస్తున్నాయి. చదవండి: సామ్ వెబ్ సిరీస్ తన ఫేవరెట్ అంటున్న నాగచైతన్య -
జర్నలిస్ట్‌గా నాగ చైతన్య.. వరుస హత్యలను ఎలా ఛేదించాడు
అక్కినేని నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ 'దూత' డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నేడు (నవంబర్ 23) చైతూ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' సినిమాలను డైరెక్ట్ చేసిన విక్రమ్ కె. కుమార్ తాజాగా దూత అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇందులో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా విడుదలన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. దూతలో నాగ చైతన్య జర్నలిస్ట్‌గా కనిపిస్తాడు. సమాచార్ అనే దినపత్రికలో సాగర్ అనే జర్నలిస్టుగా చైతూ నటించాడు. ఈ క్రమంలో నగరంలో జరిగే వరుస హత్యలకు న్యూస్ పేపర్లో వచ్చే కార్టూన్లకు సంబంధం ఉన్నట్లు ఆయన కనుగొంటాడు. హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు జర్నలిస్ట్‌గా చైతన్య చేసిన సాహాసాలు ఎలాంటివి..? ఈ క్రమంలో అతని మీదే నేరం ఎందుకు పడుతుంది..? చిక్కుల్లో పడిన ఒక జర్నలిస్ట్ ఎలా బయటపడ్డాడు అనేది తెలియాలంటే డిసెంబర్ 1న అమెజాన్‌లో చూడాల్సిందే. -
అభిమానులకు నాగచైతన్య బిగ్ సర్ప్రైజ్.. ఏం చేశారంటే?
ఈ ఏడాది కస్టడీ సినిమాతో అభిమానులను అలరించిన అక్కినేని హీరో నాగచైతన్య. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటించగా.. ప్రియమణి కీలకపాత్రలో కనిపించారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించారు. అయితే ఇప్పటికే చాలామంది హీరోలు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వగా.. చైతూ సైతం సరికొత్త సిరీస్‌తో అరంగేట్రం చేస్తున్నారు. నాగచైతన్య ప్రధానపాత్రలో నటించిన వెబ్ సిరీస్ దూత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సిరీస్ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఇందులో భాగంగానే ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయారు నాగచైతన్య. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సరికొత్త పంథాలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈనెల 23న చైతూ బర్త్ డే కావడంతో స్పెషల్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. తన అభిమానుల కోసం సరికొత్తగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. సాధారణంగా తన అభిమాన హీరోను కలవాలంటే మనమే వాళ్ల ఇంటికి వెళ్తాం. కానీ ఇక్కడ నాగచైతన్యనే స్వయంగా అభిమానుల ఇంటికి వెళ్లి వారికి ఆశ్చర్యానికి గురి చేశారు. అంతే కాకుండా వారికి గిఫ్ట్ బాక్సులు కూడా అందజేశారు. దీంతో అభిమాన హీరోనే స్వయంగా తమ ఇంటికి రావడంతో ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. ఫ్యాన్స్‌ను కలిసిన చైతూ వారితో కాసేపు మాట్లాడారు. ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ..'పర్సనల్‌గా నాకు సంతృప్తినిచ్చిన వెబ్ సిరీస్ ఇది. ఈ జోనర్‌ను నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ సిరీస్ ట్రైలర్‌ను నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న రిలీజ్ చేయనున్నారు. కాగా.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ రానుంది. శరద్ మరార్ నిర్మించిన ఈ సిరీస్‌కు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఆయన నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' సినిమాలు చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
నాగచైతన్య తొలి సిరీస్ 'దూత'.. ఓటీటీలో అప్పటి నుంచే స్ట్రీమింగ్
ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే హీరోహీరోయిన్లందరూ ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తూ అదరగొడుతున్నారు. ఇప్పటికే చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్లో కనిపించగా తాజాగా నాగచైతన్య కూడా అందుకు సిద్ధమయ్యాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ దూత. ఈ వెబ్ సిరీస్ ప్రకటించి చాలా రోజులు కావస్తున్నా దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం, అప్డేట్స్ లేకుండా పోయాయి. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదల మాత్రం ఆలస్యం అవుతోంది. ఎట్టకేలకు దూత విడుదల తేదీ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ రానుందట. శరద్ మరార్ నిర్మించిన ఈ సిరీస్‌కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈయన నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' సినిమాలు చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. చై సినిమాల విషయానికి వస్తే.. ‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. సాయిపల్లవి హీరోయిన్గా చేస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నాడు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి తండెల్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. శ్రీకాకుళంలో మత్స్యకారులను తండెల్ అని పిలుస్తారట. mystery or message? you’ll find out soon enough 👀#DhoothaOnPrime, Dec 1 pic.twitter.com/7vNbKk6Aih — prime video IN (@PrimeVideoIN) November 15, 2023 చదవండి: -
రెండు భాషల్లో నాగ చైతన్య ‘దూత’.. అమెజాన్‌లో రిలీజ్
మేనమామ వెంకటేశ్, బావ రానాలానే నాగచైతన్య కూడా ఓటీటీకి సై అన్నారు. ‘దూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నారు చైతూ. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. కాగా అక్కినేని కుటుంబంతో ‘మనం’లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ ‘దూత’లో నాగచైతన్యను డిఫరెంట్ లుక్‌లో చూపించనున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదల కానుంది. -
రానాను ఫాలో అవుతున్న నాగచైతన్య
తరచూ హీరోయిజం అంటే హీరోలకు బోర్ కొడుతుంది అనుకుంటా..అందుకే విలనిజం పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.రానా రెగ్యులర్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇదే ట్రెండ్ లోకి నాగ చైతన్య అడుగు పెడుతున్నాడు. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాగ చైతన్య.బంగార్రాజు తర్వాత విక్రమ్ కుమార్ మేకింగ్ లో థ్యాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. దాంతో విక్రమ్ కుమార్ మేకింగ్ లోనే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.దూత అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు చైతూ. హారర్ థ్రిల్లర్ జానర్ లో దూత వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. మాలీవుడ్ బ్యూటీ పార్వతి, ప్రియా భవాని శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇయర్ ఎండ్ కు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానున్న దూత వెబ్ సిరీస్ లో నాగ చైతన్య నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఆగస్ట్ 11న ఆమిర్ ఖాన్ , నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన లాల్ సింగ్ చెద్దా రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఆమిర్ ఖాన్ మూవీ కావడంతో లాల్ సింగ్ చెద్దాతో నార్త్ లో తనకు కూడా మంచి గుర్తింపు వస్తుందని నాగ చైతన్య ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. అందుకే ఏడాది చివర్లో అమెజాన్ ప్రైమ్ లో దూతను రిలీజ్ చేసి నార్త్ లోనూ తన మార్కెట్ ను విస్తరించాలనుకుంటున్నాడు.