
‘‘దూత’ వెబ్ సిరీస్‌ని అమేజాన్ సంస్థ వారు 38 భాషల్లో సబ్ టైటిల్స్‌తో 240 దేశాల్లో విడుదల చేశారు. వీక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో నాగచైతన్య, విక్రమ్, నేను.. ఇలా ‘దూత’ టీమ్ అంతా చాలా ఆనందంగా ఉన్నాం’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘దూత’. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 1 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది.
ఈ సందర్భంగా శరత్ మరార్ మాట్లాడుతూ– ‘‘విక్రమ్ చెప్పిన ‘దూత’ ఆలోచన, కథాంశం చాలా నచ్చింది. ఈ కథకి నాగచైతన్యనే మొదటి ఎంపిక. ఆయనకు ఇది తొలి వెబ్ సిరీస్. కథ వినగానే చేద్దామన్నారు. సినిమా, వెబ్ సిరీస్.. ఏదైనా నిర్మాణం అనేది సవాల్‌తో కూడుకున్న వ్యాపారం. ప్రస్తుతం నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రెండు చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment