Naga Chaitanya To Play Negative Role In Dhoota Web Series, Deets Inside - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: నెగెటివ్‌ రోల్‌లో నాగచైతన్య

Published Sat, Mar 12 2022 5:06 PM | Last Updated on Sat, Mar 12 2022 7:23 PM

Naga Chaitanya To Play Negative Role In Dhoota Web Series - Sakshi

తరచూ హీరోయిజం అంటే హీరోలకు బోర్ కొడుతుంది అనుకుంటా..అందుకే విలనిజం పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.రానా రెగ్యులర్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇదే ట్రెండ్ లోకి నాగ చైతన్య అడుగు పెడుతున్నాడు.

ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాగ చైతన్య.బంగార్రాజు తర్వాత విక్రమ్ కుమార్ మేకింగ్ లో థ్యాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. దాంతో విక్రమ్ కుమార్ మేకింగ్ లోనే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.దూత అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు చైతూ. హారర్ థ్రిల్లర్ జానర్ లో దూత వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. మాలీవుడ్ బ్యూటీ పార్వతి, ప్రియా భవాని శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇయర్ ఎండ్ కు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానున్న దూత వెబ్ సిరీస్ లో నాగ చైతన్య నెగెటివ్ రోల్ చేస్తున్నాడు.

ఆగస్ట్ 11న ఆమిర్ ఖాన్ , నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన లాల్ సింగ్ చెద్దా రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఆమిర్ ఖాన్ మూవీ కావడంతో లాల్ సింగ్ చెద్దాతో నార్త్ లో తనకు కూడా మంచి గుర్తింపు వస్తుందని నాగ చైతన్య ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. అందుకే ఏడాది చివర్లో అమెజాన్ ప్రైమ్ లో దూతను రిలీజ్ చేసి నార్త్ లోనూ తన మార్కెట్ ను విస్తరించాలనుకుంటున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement